Trends

మీ పేరు మీద ‘9’ సిమ్ లు తీసుకున్నారా?

సెల్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సిమ్ లకు మించి ఉండేవి కావు. తర్వాతి కాలంలో ఎవరికి వారే కాదు.. ఇంట్లో వారి కోసం.. పెద్ద ఎత్తున సిమ్ లు కొనేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. చేతిలో ఉండే ఫోన్లో రెండు సిమ్ లు.. చాలామందికి ఉండే మరో ఫోన్ లో మరో రెండు కానీ ఒక సిమ్ కాని ఉండటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంటుంది. జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మిగిలిన సిమ్ లు ఎలా ఉన్నా.. జియో సిమ్ ఒకటి ఉంచుకోవటం ఒక అలవాటుగా మారింది.

అయితే.. తమ సొంతానికి.. తమ ఇంట్లో వారి కోసం సిమ్ లు కొనేయటం.. వాటిని అప్పుడప్పుడు వాడే వారు కొంతమంది ఉంటారు. కానీ.. మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల లెక్కను ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డులు ఉంటే.. చర్యలు తీసుకోవడం కోసం తాజాగా డిసైడ్ చేశారు. తాజాగా టెలికాం శాఖ ఆదేశాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

సిమ్ కార్డు కనెక్షన్ ఒక్కరి పేరు మీద తొమ్మిది సిమ్ లు ఉంటే.. వాటిని మళ్లీ ధ్రువీకరించు కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ధ్రువీకరణ లేకపోతే.. సదరు సిమ్ లను తొలగించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని వారికి 9 సిమ్ కార్డుల పరిమితి ఉంటే.. జమ్ముకశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. అసోంలో ఉండే వారికి మాత్రం ఈ పరిమితి ఆరుకు మాత్రమే. తమకున్న సిమ్ కార్డుల్లో వేటిని యాక్టివ్ చేసుకోవాలి? వేటిని డీయాక్టివేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు తేల్చుకోవాలని చెబుతున్నారు.

ఇదంతా ఎందుకంటే ఆర్థిక నేరాలు.. ఇబ్బంది పెట్టే కాల్స్.. మోసపూరిత చర్యల కోసం సిమ్ లను విరివిరిగా వాడేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తిగత చందాదారు వద్ద తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ లు ఉండి ఉంటే.. వెంటనే వారు వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ప్లాగ్ చేయాలని నిర్ణయించారు. ఇలాంటి వారి కనెక్షన్లకు అవుట్ గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయించారు. ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని 45 రోజుల్లోపు తొలగించాలని డిసైడ్ చేశారు.

This post was last modified on December 9, 2021 10:40 am

Share

Recent Posts

చీకట్లో మొబైల్‌ చూస్తున్నారా.. ఈ డేంజర్‌ గురించి తెలుసుకోండి..

రాత్రి నిద్రపోయే ముందు ఫోన్‌ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్‌ స్క్రీన్‌…

9 minutes ago

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

1 hour ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

1 hour ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

2 hours ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

4 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

4 hours ago