టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు 2019లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం తాను నెలకొల్పిన క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్న యువీ పేరు క్రీడలపరంగా ఈ మధ్యకాలంలో పెద్దగా వార్తల్లో వినబడలేదు. ఈ క్రమంలోనే తాజాగా యువీ తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అభిమానుల కోరిక ప్రకారం మరో నాలుగు నెలల్లో తాను మైదానంలో అడుగుపెట్టబోతున్నానని యువీ చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది.
భగవంతుడు మన గమ్యాన్ని నిర్దేశిస్తాడన్న యువీ… అభిమానుల కోరిక ప్రకారం తాను వచ్చే ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు. టీమిండియాకు అభిమానుల మద్దతు ఇలాగే కొనసాగాలని, నిజమైన అభిమాని.. కఠిన సమయాల్లో కూడా జట్టుకు మద్దతుగా నిలుస్తాడని యువీ అన్నాడు. 2017లో ఇంగ్లండ్ పై సాధించిన సెంచరీ వీడియోను పోస్ట్ కు యాడ్ చేశాడు.
ఈ క్రమంలోనే యువీ పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు, యువీ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. యువీ రాక కోసం ఎదురుచూస్తున్నామని, మళ్లీ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొడితే చూడాలని ఉందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. అయితే, ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో భారత్ వరుస ఓటముల నేపథ్యంలో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో జట్టుకు అండగా నిలవాలన్న పిలుపునివ్వడమే యువీ పోస్ట్ ఉద్దేశ్యమని మరి కొందరంటున్నారు.
ఇక, అసలు విషయం అది కాదని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగాల్సి ఉందని, ఆ సిరీస్ లో యువీ కూడా పాల్గొనబోతున్నాడని కొందరు అంటున్నారు. ఆ టోర్నీలో ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టబోతున్నానని చెప్పాడని, కాకపోతే కొంత ట్విస్ట్ చేసి ప్రాంక్ లా చెప్పాడని కొందరు అంటున్నారు. అయితే, యువీ.. రోడ్ సేఫ్టీ సిరీస్ కోసమే ఈ పోస్టు పెట్టాడా..? లేక నిజంగానే రీ ఎంట్రీ ఇస్తాడా..? అన్నది తేలాలంటే మాత్రం ఫిబ్రవరి దాకా వేచి చూడక తప్పదు.
This post was last modified on November 3, 2021 6:36 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…