Trends

పొగిడినా ఐపీఎలే.. తిట్టినా ఐపీఎలే

కొన్ని నెలల కిందట విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం పర్యటిస్తుంటే.. ఇంకోవైపు శిఖర్ ధావన్ నాయకత్వంలో ఇంకో 20 మందితో కూడిన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇలా రెండు దేశాలకు రెండు జట్లను పంపేంత లగ్జరీ ప్రపంచ క్రికెట్లో ఇండియాకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు.

అంతమంది ప్రతిభావంతులు భారత క్రికెట్లో ఉన్నారు. అవసరమైతే ఇంకో జట్టును కూడా సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ ఆడించగల సత్తా భారత్‌కు ఉందన్నది స్పష్టం. ఈ స్థాయిలో యువ ప్రతిభావంతులు వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఐపీఎల్ అనడంలో సందేహం లేదు.

దేశంలో యువ క్రికెటర్లు ప్రతిభ చాటుకోవడానికి ఇంతకంటే వేదిక మరొకటి లేదు. కేవలం ఒక్క మ్యాచ్‌తో హీరోలైపోయి అందరి నోళ్లలో నాని.. కొంత కాలానికే భారత జట్టు తలుపు తట్టే స్థాయికి కుర్రాళ్లు వస్తున్నారంటే అందుక్కారణం ఐపీఎలే.

జస్‌ప్రీత్ బుమ్రా సహా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చింది ఐపీఎల్‌తోనే. భారత క్రికెట్‌కు ఐపీఎల్ చేసిన మేలు అంతా ఇంతా కాదని అంతర్జాతీయ స్థాయిలో ఎందరో దిగ్గజ ఆటగాళ్లు, మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కొనియాడిన వాళ్లే. ఈ విషయంలో ఇండియాను చూసి అసూయ కూడా చెందుతుంటారు. ఐతే ఇంతలా పొగిడిన ఐపీఎల్‌ను ఇప్పుడు అందరూ తెగ తిట్టేస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శన చూసి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయడం తప్పని.. మనోళ్లందరూ ఐపీఎల్ మత్తులో ఉండి అదే మాదిరి గుడ్డి షాట్లు ఆడేస్తున్నారని.. ఈ కుర్రాళ్లు ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీల కోసం, డబ్బు కోసం అయితే ప్రాణం పెట్టి ఆడేస్తారని.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

నిన్న న్యూజిలాండ్ చేతిలో మ్యాచ్ ఓడినప్పటి నుంచి ‘బ్యాన్ ఐపీఎల్’ అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుండటం.. నెటిజన్లు లీగ్ మీద విరుచుకుపడిపోతుండటం గమనార్హం. ఐతే ఇలా తిట్టేవాళ్లందరూ ఐపీఎల్ వచ్చిందంటే ఎక్కడ లేని ఉత్సాహంతో టీవీల ముందు కూలబడిపోతారన్న మాట వాస్తవం.

This post was last modified on November 1, 2021 3:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: IndiaIPL

Recent Posts

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

17 minutes ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

1 hour ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

3 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

4 hours ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

4 hours ago