టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన కెప్టెన్సీ వదులుకుంటున్నాడా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. మిప్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత.. కోహ్లీ ఆ బాధ్యతలను స్వీకరించాడు. అయితే.. ఇప్పుడు.. కోహ్లీ నుంచి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు చెబుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ వార్త విని.. కోహ్లీ అభిమానులు చాలా కలవరపడుతున్నారు.. త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉండబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం టెస్ట్, వన్డే, టీ20లకు కోహ్లీయే కెప్టెన్ కాగా… రోహిత్ శర్మ వైఎస్ కెప్టెన్ గా ఉన్నారు.
వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్న రోహిత్ కు వన్డేలతో పాటు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా.. ఈ వార్తలు విపరీతంగా వస్తుండటంతో.. దీనిపై ఏకంగా బీసీసీఐ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
అన్ని ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని క్లారిటీ ఇచ్చింది. జాతీయ మీడియాలో ఈ విషయమై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని క్లారిటీ ఇవ్వడం విశేషం. కాగా.. బీసీసీఐ క్లారిటీ తర్వాత.. కోహ్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on September 14, 2021 11:10 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…