అప్పుడెప్పుడో వచ్చిన ప్రభుదేవా నటించిన ‘ప్రేమికుడు’ సినిమా గుర్తుందా? ప్రియురాలు వాడిపారేసే ప్రతి వస్తువును జాగ్రత్తగా దాచుకోవటమే కాదు.. అపురూపంగా చూసుకోవటం తెలిసిందే. ఇదే సినిమాలో ప్రియురాలి వాడిపారేసే వస్తువులకు ఉండే విలువ ఎంతో కూడా చెప్పేస్తూ పాట కూడా ఉంది. అప్పట్లో అదో పెద్ద హిట్. ఇప్పుడు జరిగిన ఉదంతాన్ని చూస్తే.. అభిమానం ప్రేమించిన ప్రియురాలి విషయంలోనే కాదు.. పిచ్చ పిచ్చగా అభిమానించే క్రీడాకారులు.. సెలబ్రిటీలు.. సినీ నటుల విషయంలోనూ ఉంటుందని చెప్పక తప్పదు.
ఎంత అభిమానం అయితే మాత్రం.. భావోద్వేగంతో కన్నీరు.. ముక్కును తుడుచుకొని పారేసి టిష్యూ పేపర్ కు కోట్లాది రూపాయిలు పలకటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదంతా విన్నప్పుడు.. తాను ముక్కు తుడుచుకొని పారేసే పేపర్ ముక్కకుకోట్లు పలుకుతుందంటే.. సదరు సెలబ్రిటీ సైతం ఆ పేపర్ ను తన కోటు జేబులో పెట్టుకునే వారేమో కానీ.. కింద పడేసేవారు కాదేమో? ఒక ప్రముఖ క్రీడాకారులు తుడిచి పారేసిన టిష్యూ పేపర్ ను వేలం వేస్తే.. ఏకంగా రూ.7.5కోట్ల ధర పలకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ క్రీడాకారుడు అంటారా? అక్కడికే వస్తున్నాం.
అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ తెలుసు కదా? ఇతగాడికి సంబంధించిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాంటాక్టు పొడిగింపు ఇష్యూలో వచ్చిన ఉదంతంపై ఆయన ప్రాతినిధ్యం వహించే స్పానిష్ ఫుట్ బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో తన అనుభవాల్ని పంచుకునే క్రమంలో కాస్తంత ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా కంటి వెంట కారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. అనంతరం దాన్ని పారేశాడు.
అయితే.. అతడు వాడి పారేసిన టిష్యూ పేపర్ ను.. ఒకడు జాగ్రత్తగా సేకరించి.. ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాంలో వేలానికి పెట్టాడు. పుట్ బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూపేపర్ అనూహ్యంగా రూ.7.5కోట్లు పలకటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి.. మెస్సీ మీద మరీ ఇంత పిచ్చ అభిమానమా? అని నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం కానీ తెలిస్తే.. ఇకపై సెలబ్రిటీలంతా తాము వాడే వస్తువుల్ని ఎందుకైనా మంచిదని జాగ్రత్తలు దాచుకొని థర్డ్ పార్టీ ఏజెన్సీల చేత వేలం పెట్టిస్తారేమో?
This post was last modified on August 18, 2021 5:29 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…