టోక్యో ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ కాంస్య పతకాలే వచ్చాయి. ఒక రజతం వచ్చింది. ఇన్ని పతకాలు వచ్చినా.. స్వర్ణం కల మాత్రం నెరవేరదేమో అనే నిరాశ ఉండేది. అది కాస్త నేటితో తీరిపోయింది. ఈ ఒలంపిక్స్ లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరింది.
వందేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఒలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది.జావెలిన్ త్రో లో 23 సంవత్సరాల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు.
అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ గోల్డ్ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. గోల్డె మెడల్ విన్నర్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత దేశాన్ని ప్రపంచానికి మరోసారి గర్వపడేలా చూపించాడని కొనియా డుతున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ చోప్రాకు హర్యానా సర్కారు భారీ నజరానా ప్రకటించింది. రూ. 6 కోట్ల నగదు మరియు గ్రూప్ -1 క్యాడర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది హర్యానా సర్కార్. అలాగే 50 శాతం రాయితీతో కూడిన ఇంటిస్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
This post was last modified on August 7, 2021 8:03 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…