ఈ మధ్య యువత చాలా సెన్సిటివ్ గా తయారౌతున్నారు. ప్రతి చిన్న విషయానికీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ మందలించారని సూసైడ్ లు చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. తాజాగా.. ఓ యువకుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. తన పురుషాంగం కోసేసుకున్నాడు.
ఆ యువకుడికి అప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం వయసు అయిపోతోందని.. పెళ్లి నిశ్చయించారు. అతను ఎంత చెప్పినా.. తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో.. తనకు ఇష్టం లేకుండా.. బలవంతంగా పెళ్లి చేస్తున్నారని.. ఆ పెళ్లిని ఆపాలని అనుకున్నాడు. అందుకు ఏకంగా తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. ఆ తర్వాత.. తాను పెళ్లికి ఇక పనికి రానంటూ గట్టిగా కేకలు వేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలోని గాంధీ నగర్ కు చెందిన మురుగన్ తన కుమారుడు 23 ఏళ్ల విజయరాఘవన్ కు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అయితే తనకు రెండేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని విజయరాఘవన్ చెప్పినా పేరెంట్స్ వినిపించుకోలేదు. వచ్చే వారం నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశారు. దీంతో విజయ రాఘవన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఆవేశంగా పురుషాంగాన్ని కోసుకున్నాడు. తను ఇక పెళ్లికి పనికిరానంటూ కేకలేశాడు. తల్లిదండ్రులు అతనిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
This post was last modified on June 30, 2021 9:52 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…