తెలుగింటి ఆడబడుచు, వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న స్పోర్స్ట్ యూనివర్సిటికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమించింది. దేశం మొత్తంమీద స్పోర్స్ట్ యూనివర్సిటి ఢిల్లీలోని ఏర్పాటవుతోంది. మరో పదేళ్ళ తర్వాత జరగబోయే ఒలంపిక్స్ పోటీల్లో దేశానికి 50 పతకాలకు తగ్గకుండా సాధించటమే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది.
ఈ యూనివర్సిటిలో ఒలింపిక్స్ లో జరిగే అనేక క్రీడలకు సంబంధించి సిలబస్ ఉంటుంది. ఏ క్రీడలో ఆశక్తున్న విద్యార్ధులు ఆ క్రీడలకు సంబంధాంచిన డిపార్టమెంటులో చేరి శిక్షణ పొందవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, క్రికెట్, స్ప్రింట్, ఈత లాంటి అనేక క్రీడలకు సంబంధించిన నిపుణులను యూనివర్సిటిలో అధ్యాపకులుగా నియమిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్ధులను యూనివర్సిటిలో చేర్చుకునే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలను ఏర్పాటుచేసింది.
ఈ యూనివర్సిటి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చేరిన విద్యార్ధులకు సదరు క్రీడల్లో నైపుణ్యాన్ని బట్టి డిగ్రీలు కూడా ప్రధానం చేస్తారు. కాబట్టి బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలకు సమానస్ధాయిలోనే స్పోర్స్ట్ డిగ్రీలు కూడా ఉండేట్లు ఢిల్లీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటికి మొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.
శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000, సిడ్నీ ఒలంపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అంతకుముందు రెండుసార్లు వరల్డ్ చాంపియన్ షిప్పులో రెండు బంగారు పతకాలు సాధించింది. ఒలంపిక్స్ లో భారత్ పతకం సాధించటం మల్లీశ్వరితోనే మొదలైంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్న మల్లీశ్వరిని వైస్ ఛాన్సలర్ గా నియమించటం సరైన నిర్ణయమనే భావించాలి.
This post was last modified on June 23, 2021 11:28 am
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…