వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఫేమస్ అవ్వాలని అనుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ.. ఆ ప్రయత్నంలో ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాకు చెందిన అలెక్స్ హార్విల్(28) అనే వ్యక్తి స్టంట్ మ్యాన్ గా విధులు నిర్వహించేవాడు. కాగా… అలెక్స్ కి ఎప్పటి నుంచో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలో.. హ్వార్విల్ 351 అడుగుల నుంచి జంప్ చేసి గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టాలని అనుకున్నాడు.
దీని కోసం మోటార్ సైకిల్ రాంప్ ఏర్పాటు చేసి, ఓ మట్టి దిబ్బపై జంప్ చేయడానికి ప్రయత్నించాడు . ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన హాలెక్స్ అక్కడే కుప్పకూలి చనిపోయాడు. స్టంట్ మాన్ అలెక్స్ హార్విల్ మరణం డర్ట్ బైక్ జంపింగ్ డేర్ డెవిల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా, అలెక్స్ హార్విల్ స్టంట్ కోసం ప్రయత్నిస్తూ.. మరణించినట్లు గురువారం గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది. అలెక్స్ మృతి పట్ల అతడి కుటుంబానికి, స్నేహితులకు, ప్రియమైనవారికి గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. కాగా, కాలిఫోర్నియాలోని కరోనాలో జన్మించిన హార్విల్ ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డ్ సాధించాడు. జూలై 2013లో హార్విల్ మోటారుసైకిల్‌పై 297 అడుగుల పొడవైన ‘డర్ట్-టు-డర్ట్ రాంప్ జంప్’ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
This post was last modified on June 22, 2021 6:11 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…