కరోనాను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు కొవిడ్ వ్యాక్సిన్ రూపొందించారు. దీనికిగాను శాస్త్రవేత్తలు నిద్రాహారాలు మాని మరీ ల్యాబులకే పరిమితమై.. ఎట్టకేలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు మళ్లీ ఓ తలనొప్పి మొదలైంది. పురుషులు కోవిడ్ టీకాను విశ్వసించకపోవడమే దానికి కారణం. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు టీకా తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు. టీకా తీసుకుంటే పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందనే ప్రచారంతో.. అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త నెమ్మదించింది.
శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..
పురషుల సంతాన సామర్థ్యంపై టీకా నిజంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? అనే కోణంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన జామా అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. దీనిలో.. టీకా వేసుకోవడం వల్ల పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందనే వార్తలను పరిశోధకులు కొట్టిపారేశారు. సంతాన సామర్థ్యంపై టీకాలు ప్రతికూల ప్రభావం చూపవని వెల్లడించారు. ధైర్యంగా టీకాలు వేసుకోవాలని పురుషులకు సూచించారు.
టీకాతో పెరిగిన సామర్థ్యం!
మియామీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొవిడ్ బారినపడని 18-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న 45 మందిపై పురుషులపై అధ్యాయనం చేశారు. 45 మందిని రెండు గ్రూపులుగా విభజించి.. ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారైన టీకాలను ఇవ్వడానికి రెండు నుంచి ఏడు రోజుల ముందు వారి నుంచి వీర్యాన్ని సేకరించారు. అనంతరం ఒక గ్రూప్ సభ్యులకు ఫైజర్ వ్యాక్సిన్‌ను.. మరో గ్రూపు సభ్యులకు మోడెర్నా టీకాలను ఇచ్చారు. రెండు గ్రూపుల సభ్యులూ.. టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం దాదాపు 70 రోజుల తర్వాత మళ్లీ వారి నుంచి వీర్యాన్ని సేకరించారు. ఇలా సేకరించిన వీర్యాన్ని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు జరిపారు. టీకాలు తీసుకోవడం వల్ల ఎవరిలోనూ వీర్యకణాల సంఖ్య కానీ, లైగింక సామర్థ్యం కానీ తగ్గలేదని స్పష్టం చేశారు. పైగా కొందరిలో సీమెన్ వ్యాల్యూమ్‌తోపాటు స్పెర్మ్ మొబిలిటీ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
మన దేశంలో పరిస్థితి ఇదీ..
అయితే.. మంచి కన్నా చెడు వేగంగా ప్రచారంలోకి వచ్చేస్తుందనే విషయం టీకా విషయంలో నిజమైంది. మన దేశంలోనూ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పురుషులు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదట. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయం చేసే రైతులు కూడా టీకాపై గుంభనంగా ఉన్నారు. వీరందరి భయమూ ఒక్కటే.. టీకా తీసుకుంటే.. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని.. నరాలు చచ్చుబడిపోతాయనే! బహుశ అందుకేనేమో.. ఇప్పటికీ 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్న టీకాల గణాంకాల్లో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణ వంటివి చాలా వెనుకబడి ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి భయాలను ఎలా పారదోలుతుందో చూడాలి.
This post was last modified on June 20, 2021 10:47 am
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…