పెళ్లి కావాల్సిన యువతీ యువకులు తమకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న జీవిత భాగస్వామి కావాలో తెలియజేస్తూ.. ‘ వరుడు కావలెను’, ‘ వధువు కావలెను’ అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ప్రకటనలు మనం చూసే ఉంటాం. అయితే.. తాజాగా ఓ వధువు తనకు కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ లో ఓ కండీషన్ పెట్టింది.
మూమూలుగా అయితే.. తెల్లగా ఉండాలి.. ఆరు అడుగులుండాలి.. ఇన్ని లక్షల జీతం ఉండాలి అని చాలా మంది అడగుతారు. అయితే.. ఈ అమ్మాయి మాత్రం.. అబ్బాయి కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని కండిషన్ పెట్టింది. దీంతో.. ఇప్పుడు ఆ ప్రకటన వైరల్ గా మారింది.
అది కూడా.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న అబ్బాయే కావాలట. తాను కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నానని.. అలాగే తాను చేసుకోవాలి అనుకుంటున్న యువకుడు కూడా కోవీషీల్డ్ రెండు డోసులు తీసుకొని ఉండాలంటూ కండిషన్ పెట్టింది. ఇప్పుడు ఆ పెళ్లి ప్రకటన నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె పెళ్లి ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇది ఇప్పుడు అందరి కంటా పడింది.
కాబోయే వరుడి కోసం ఆమె చేసిన క్రియేటివ్ ఆలోచన ఫన్నీగా నవ్వులు కురిపిస్తోంది. అంతే కాదండోయ్ వరుడులో ఏయే క్వాలిటీస్ ఉండాలో స్పష్టంగా చెప్పి.. పైన పేర్కొన్న అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం గమనార్హం.
This post was last modified on June 9, 2021 11:05 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…