కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ప్రపంచదేశాలు కొత్తరకం పాస్ పోర్టును తీసుకు రాబోతున్నాయా ? అవునే సమాధానం వినిపిస్తోంది. ఈ కొత్తరకం పాస్ పోర్టే వ్యాక్సిన్ పాస్ పోర్టట. మామూలుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యెమెంట్ల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇపుడు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లతో పాటు వ్యాక్సిన్ పాస్ పోర్టు కూడా చాలా ముఖ్యమైనదిగా మారబోతోంది.
ఇంతకీ వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే ఏమిటంటే తమకు కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణగా చెప్పే సర్టిఫికేటే. అవును ఏదైనా విదేశానికి ప్రయాణం చేయాలంటే ఇపుడు అనేక సర్టిఫికేట్లను చూపించాల్సుంటుంది. విమానం ఎక్కేటపుడు, దిగేటపుడు కూడా ఈ సర్టిపికేట్లు చూపటం చాలా అవసరం. కొన్నిసార్లయితే మధ్యలో ఒకటిరెండు విమానాలను మారాల్సుంటుంది.
ఇలాంటపుడు ప్రతి విమానం ఎక్కేటపుడు సర్టిపికేట్ చూపాలంటే చాలా కష్టంగా ఉంటోందని అంతర్జాతీయ టూరిజం గుర్తించింది. అందుకే అనేక సర్టిఫికేట్లను ప్రతిసారీ చూపించేబదులు ఒకే సర్టిఫికేట్ చూపిస్తే చాలని ప్రపంచదేశాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ సోకలేదని చెప్పే సర్టిఫికేట్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండటమే. కాబట్టి ఏ దేశంలో అయినా చెల్లుబాటయ్యేట్లుగా ఒకే సర్టిఫికేట్ ను జారీచేసేందుకు ప్రపంచదేశాలు కసరత్తు చేస్తున్నాయి.
ఇకనుండి ఎవరైనా ఒకదేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేయాలనుకునే వారు తమ డాక్యుమెంట్లతో పాటు కరోనా వైరస్ నెగిటివ్ సర్టిఫికేట్ ను కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది. తొందరలోనే ఈ సర్టిఫికేట్ డిజైన్ పూర్తవుతుంది. అప్పుడు దాన్ని అన్నీ దేశాలకు పంపించి ఆమోద ముద్రవేసేట్లు కసరత్తు జరుగుతోంది. ఒకసారి ఈ డిజైన్ రెడీ అయిపోతే సర్టిపికేట్ విషయంలో చాలా సమస్యలు తప్పుతుందేమో.
This post was last modified on May 25, 2021 7:14 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…