కరోనా ధాటికి నాలుగు రోజుల కిందట ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో అరడజను దాకా కేసులు వెలుగు చూడటంతో టోర్నీని కొనసాగించే పరిస్థితి లేకపోయింది. ఎంతో సురక్షితం అనుకున్న బయో బబుల్ లోపల కరోనా కేసులు బయటపడటంతో వైరస్ ప్రభావం అంతటితో ఆగదని అర్థం చేసుకుని మరో మార్గం లేక లీగ్‌ను ఆపేసింది బీసీసీఐ.
ఐతే లీగ్ ఆగినా.. ఆటగాళ్లలో చాలామంది వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నా కరోనా మాత్రం ఆగడం లేదు. తాజాగా టోర్నీలో భాగమైన ఇద్దరు ఆటగాళ్లు కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలారు. ఐపీఎల్-14లో ముందుగా కరోనా కేసులు బయటపడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోనే తాజా కేసులు కూడా నమోదవడం గమనార్హం. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన ప్రసిద్ధ్ కృష్ణ (కర్ణాటక), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఐపీఎల్ వాయిదా పడ్డాక చివరగా అహ్మదాబాద్‌లో కరోనా పరీక్ష చేయించుకుని స్వస్థలం అయిన బెంగళూరుకు బయల్దేరాడు ప్రసిద్ధ్. ఆ సందర్భంగా అతడికి నెగెటివే వచ్చింది. కానీ విమానంలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నాక రెండు రోజులకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లలో కొంతమంది మాల్దీవులకు వెళ్లి ఆ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం లండన్‌కు బయల్దేరే ప్రయత్నంలో ఉండగా.. మరికొంతమంది స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ బృందంలో సీఫర్ట్ కూడా ఒకడు. కాగా ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది.
కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగానే ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హసికి చికిత్స అందించిన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సీఫర్ట్‌ను తరలించాలని నిర్ణయించారు. అహ్మదాబాద్ నుంచి అతణ్ని చెన్నైకి పంపే ప్రయత్నం జరుగుతోంది. కోలుకున్నాక అక్కడి నుంచే అతను న్యూజిలాండ్‌కు వెళ్తాడు. కోల్‌కతా జట్టులో ముందుగా వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలడంతోనే లీగ్ ఆగింది. ఆ తర్వాత మరిన్ని కేసులు బయటపడటంతో టోర్నీని వాయిదా వేశారు.
This post was last modified on May 9, 2021 11:22 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…