ఏడాదికి ఒకసారి ప్రముఖ మీడియా దిగ్గజం ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల లెక్క కట్టటం తెలిసిందే. ఏడాదికి ఒకసారి ఈ సంస్థ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని మదింపు చేసి.. సంపన్నుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది రూ.7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని లెక్క కట్టింది. ఇలాంటివారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మందిగా తేల్చింది. టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు సంపాదించగా.. భారతీయ వ్యాపార ప్రముఖులు పలువురు జాబితాలో చోటు దక్కించుకున్నారు.
తెలుగురాష్ట్రానికి చెందిన పలువురు కూడా ఈ జాబితాలో చోటు దక్కటం విశేషం. తొలి 200 స్థానాల్లో దేశీయంగా ఏడుగురికి చోటు లభించింది. ఇటీవల కాలంలో ఆస్తుల్ని విపరీతంగా పెంచేసుకుంటున్న గౌతమ్ అదానీ జాబితాలో 24వ స్థానానికి చేరటం గమనార్హం. టాటా.. బిర్లాలను అదానీ.. డిమార్ట్ అధినేతలు దాటేయటం గమనార్హం. అంతేకాదు.. జాబితాలో పలువురు తెలుగు పారిశ్రామిక దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. మెరుగైన ర్యాంకు విషయానికి వస్తే దివి ఫార్మా అధినేత మురళి దివి 384వ ర్యాంకుకు చేరుకున్నారు. తెలుగు వారిలో అత్యంత సంపన్నులుగా తేలింది ఎవరంటే..?
వ్యక్తి పేరు ర్యాంకు సంపద విలువ (బి.డాలర్లలో)
మురళి దివి 384 6.8
రామ్ ప్రసాద్ రెడ్డి 1008 3.0
పీపీ రెడ్డి 1931 1.6
పీవీ క్రిష్ణారెడ్డి 2035 1.5
అపోలో ప్రతాప్ రెడ్డి 2035 1.5
సతీశ్ రెడ్డి 2035 1.5
జీవీ ప్రసాద్ 2378 1.2
ఎం.ఎస్.ఎన్ రెడ్డి 2524 1.1
దేశీయంగా చూస్తే.. (టాప్ 200 ర్యాంకు లోపు)
గౌతమ్ అదానీ 24 50.5
శివ్ నాడార్ 71 23.5
రాధాకిషన్ దమానీ 117 16.5
ఉదయ్ కోటక్ 121 15.9
పల్లోంజీ మిస్త్రీ 140 14.6
కె.ఎం. బిర్లా 168 12.8
సైరస్ పూనావాలా 169 12.7
This post was last modified on April 7, 2021 1:22 pm
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…