ప్రపంచ మగాళ్లందరికి హెచ్చరిక. మహా అయితే మరో పాతికేళ్లు. అప్పటికే మగాళ్ల ఆయువు మీద దెబ్బ పడే దారుణ వైనాన్ని వెల్లడించిందో నివేదిక. సంచలనంగా మాత్రమే కాదు షాకింగ్ గా మారిన ఈ అధ్యయనంలోని వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వటమే కాదు.. మగాళ్లంతా వణికిపోవటం ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా మానవజాతి ఫలదీకరణ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు.
అనునిత్యం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న పలు రసాయనాల కారణంగా క్రమంగా మగాళ్లలోని వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు.. అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతుందని హెచ్చరించారు. కౌంట్ డౌన్ పేరుతో తాజాగా విడుదల చేసిన పుస్తకాన్ని షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు వెల్లడించారు. ఈ పుస్తకం చెప్పిన దాని ప్రకారం 1973తో పోలిస్తే ఇప్పటికి.. మగాళ్లలో వీర్య కణాల సంఖ్య 60 శాతం మేర తగ్గిందని.. ఇదే తరహా సాగితే 2045 నాటికి స్పెర్మ్ కౌంట్ జీరోకు చేరుతుందని హెచ్చరించారు.
అదే వాస్తవరూపం దాలిస్తే.. ఫ్యూచర్ లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదన్న షాకింగ్ నిజం వెల్లడైంది. ఈ విపత్తుకు కారణం రోజువాడే వస్తువుల్లోని రసాయనాలే అని చెబుతున్నారు. ఫుడ్ ర్యాపింగ్స్ మొదలు ప్లాస్టిక్ కంటైనర్లు.. రోజువారీ వాడే డియోడరెంట్లు.. సబ్బులు.. ఇలా అన్నింటిలోనూ ఉండే ప్రమాదకరమైన రసాయనాలు మగాళ్ల కొంప ముంచనున్నాయని చెబుతున్నారు.
చాలా వస్తువుల్లో వాడే పీఎఫ్ఏఎస్ గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ప్రకృతిలో బ్రేక్‌డౌన్ కావని.. ఇవి శరీరంలో అలా ఉండిపోతాయని చెబుతున్నారు. ఇవి పేరుకుపోయే కొద్దీ.. హార్మోన్ల అసమతుల్యత పెరుగుతోందని చెబుతున్నారు. అయితే.. ఈ రసాయనాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా లేదంటున్నారు. కొన్ని దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేస్తే.. మరికొన్ని దేశాల్లో అంతలా లేదంటున్నారు. ఈ రసాయనాల కారణంగా మగవారి అంగ పరిణామం.. వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాయో లేదో?
This post was last modified on March 21, 2021 8:51 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…