ఒక మనిషి చిరుత చేతికి చిక్కాడంటే అంతే సంగతులు. చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడటం కష్టమే. అలాంటిది ఒట్టి చేతులతో ఒక మనిషి చిరుతను చంపేశాడంటే నమ్మశక్యంగా అనిపించదు. అతనేమీ అడవుల్లో జంతువులతో తిరిగే టార్జాన్ టైపూ కాదు. మన మధ్య తిరిగే ఒక సామాన్యుడు. పైగా నడి వయస్కుడు. ఆ యోధుడి పేరు.. రాజగోపాల్ నాయక్. కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి తన భార్యా పిల్లల్ని కాపాడుకునే క్రమంలో అతను అద్భుతం చేశాడు. ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు. ఈ సాహస గాథకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి.
కర్ణాటకకు చెందిన రాజ గోపాల్ నాయక్.. తన భార్య, కూతురితో కలిసి బెండెకెరె అనే పల్లెటూరిలో ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా.. పక్కనున్న అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన చిరుత.. ఎగిరి వీరి మీదికి దూకింది. ఆ దెబ్బతో భార్య, కూతురితో కలిసి బండి మీది నుంచి కింద పడ్డాడు రాజగోపాల్. చిరుత మళ్లీ వీరి మీదికి దూసుకురావడంతో రాజగోపాల్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దాన్ని విడిచిపెడితే భార్య, బిడ్డ తనకు దక్కరని తన ప్రాణం పోయినా పర్లేదు దాంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే.. చిరుతతో కలబడ్డాడు. 20 నిమిషాల పాటు దాంతో అసాధారణ రీతిలో పోరాడాడు. ఈ క్రమంలో చిరుత అతణ్ని తీవ్రంగా గాయపరిచింది. అయినా తట్టుకుని ఒట్టి చేతులతో దాన్ని చంపేశాడు.
ఈలోపు సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. రాజగోపాల్ రక్తమోడుతూ.. చచ్చి పడి ఉన్న చిరుత ముందు కూర్చుని ఉండటం చూసి షాకైపోయారు. ఇదెలా సాధ్యమైందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. భార్య, బిడ్డ కోసం రాజగోపాల్ చేసిన సాహసానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అతణ్ని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ మధ్యే రిలీజైన ‘దృశ్యం-2’లో కుటుంబం కోసం అసాధారణ సాహసం చేసే జార్జి కుట్టితో రాజగోపాల్‌ను పోలుస్తున్నారు.
This post was last modified on February 24, 2021 4:51 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…