నిన్నటి విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. 11 మంది ప్రాణాలు హరించిన ఈ ఉదంతం.. వందల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. ఇప్పటికీ గోపాలపట్నంలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. గ్యాస్ పీల్చిన వారికి మున్ముందు ఎలాంటి సమస్యలు ఉంటాయో అన్న ఆందోళన ఉంది. జనావాసాల మధ్య ఉన్న కంపెనీ.. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా ఎలా పనుల్ని పున:ప్రారంభించిందన్నది అర్థం కావట్లేదు.
ఇందులో ఎల్జీ పాలిమర్స్ తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇలాంటి నిర్లక్ష్యం వేరే రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంది. నిన్న మరో మూడు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ గఢ్‌లోనూ ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ అయింది. తమిళనాడులోని కడలూరులో ఉణ్న ఎన్ఎల్సీ పవర్ స్టేషన్లో బాయిలర్ బ్లాస్ట్ జరిగింది. అలాగే మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ఫార్మా ప్యాకేజింగ్ కంపెనీలు ఫైర్ బ్రేక్స్ జరిగాయి. నెలన్నర పాటు అన్ని రకాల పరిశ్రమలను ఆపేయడం.. ఈ కాలంలో ఎలాంటి మెయింటైనెన్స్ కూడా లేకపోవడంతో మళ్లీ పనులు ప్రారంభించేటప్పటికి ఇలాంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నట్లుంది.
లాక్ డౌన్ టైంలో మెయింటైనెన్స్ పనులు కూడా ఆపేయడం.. మళ్లీ ఫ్యాక్టరీల్ని పున:ప్రారంభించేటపుడు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో అవగాహన లేకపోవడం, నిపుణుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ విశాఖలో మాత్రం తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు.
This post was last modified on May 8, 2020 3:10 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…