కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాను ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మరే దేశానికి జరగనంత నష్టం ఆ దేశానికి జరిగింది.. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. ఇప్పటికి ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతూనే ఉన్నాయి. అమెరికా చరిత్రలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దరిద్రపు గొట్టు రికార్డు కరోనా సొంతం చేసుకుంది. దీని పుణ్యమా అని అమెరికాలో వేలాది మంది తమ ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు.
అలాంటి వారిలో మిషెల్ వోల్ కెర్ట్ అనే మహిళ కూడా ఉన్నారు. కరోనా కారణంగా గత జులైలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఆమె.. తనలా జాబ్ పోగొట్టుకున్న వారిని ఫేస్ బుక్ లో కలుసుకొని వారి కష్టాల గురించి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన అంశాల్ని అధ్యక్షుల వారికి తెలియజేయాలని భావించారు. ఇటీవల ఆమె ఒక లేఖ రాశారు. అది కాస్తా.. జో బైడెన్ వద్దకు చేరటం.. ఆయన స్వయంగా మిషెల్ కు ఫోన్ చేశారు. ప్రతి వారంతంలో నిర్వహించే వీక్లీ కాన్వర్సేషన్స్ లో భాగంగా ఆమెకు ఫోన్ చేశారు.
తాను లేఖ చదివానని.. తనను కదిలించినట్లుగా ఆయన చెప్పారు. తాను పని చేస్తున్న కంపెనీలో చాలామందిని తీసేశారని.. తాను కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న విషయాన్ని ఆమె బైడెన్ కు చెప్పారు. ప్రస్తుత సమయంలో ఉద్యోగాన్ని వెతుక్కోవటం ఎంతో కష్టంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా బైడెన్ తన తండ్రి తనకు చెప్పిన ఒక విషయాన్ని పంచుకున్నారు. ఉద్యోగం అంటే.. కేవలం జీతం మాత్రమే కాదని.. ఉద్యోగం అంటే ఒక గౌరవం.. మర్యాద అని.. సమాజంలో ఒకరి స్థానం ఏమిటో చెప్పేది ఉద్యోగమేనని తనతో చెప్పేవారన్నారు. దీనికి స్పందించిన సదరు మహిళ.. బైడెన్ తండ్రి మాటలు తననెంతో కదిలించాయన్నారు.
ఈ సందర్భంగా కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడించారు. బైడెన్ తనకు నేరుగా ఫోన్ చేయటంపై ఆమె అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కరోనా కారణంగా నష్టపోయిన వారిని ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఆదుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. రానున్న వంద రోజుల్లో పది కోట్ల మందికి వ్యాక్సిన్ డోస్ వేయనున్నట్లుగా బైడెన్ చెప్పగా.. తన తల్లిదండ్రులకు ఈ రోజునే వ్యాక్సిన్ వేయిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుల వారు ఫోన్ చేసిన రోజునే వ్యాక్సిన్ అపాయింట్ మెంట్ దొరికినట్లు చెప్పగా.. బైడెన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
చివరకు తన కుమార్తెతో మాట్లాడతారా? అని అడిగిన మహిళకు ఓకే చెప్పిన బైడెన్ మాట్లాడారు. ఆ సందర్భంగా మిషెల్ ధైర్యం.. డెడికేషన్ .. ఉద్యోగం చేయాలన్న తపన తనకు ఎంతో నచ్చినట్లుగా బైడెన్ పేర్కొన్నారు. ఈ సంభాషణ మొత్తాన్ని రెండు వైపులా షూట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా ఇలాంటి పనులు చేసినా.. అధ్యక్షుల వారి మాటలు ఎంతోమంది అమెరికన్లకు సాంత్వనగా మారతాయని చెప్పక తప్పదు.
This post was last modified on February 8, 2021 11:38 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…