Trends

కో వాగ్జిన్ అంటే భయపడుతున్నారా ?

ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది. తీరా వ్యాక్సిన్ తయారైందంటే వేసుకోవటానికి భయపడుతున్నారు. నిజంగా కరోనా వైరస్ నేపధ్యంలో పరిస్ధితులు చాలా విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ వేసుకోకపోయినా ప్రాణభయమే, వేసుకున్నా ప్రాణభయమే అన్నట్లుగా తయారైంది పరిస్దితులు. ఇక్కడ విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని వదిలేసినా మనదేశంలో ప్రస్తుతం రెండు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

మొదటిదేమో పూణె కంపెనీలో తయారైన కోవీషీల్డ్. ఇక రెండోదేమో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీలో తయారైన కోవాగ్జిన్. అయితే మెజారిటి జనాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవటానికి రెడీ అంటున్నారే కానీ కోవాగ్జిన్ మాత్రం వద్దంటే వద్దంటున్నారట. కేంద్రప్రభుత్వం మాత్రం రెండు రకాల వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ఎటువంటి షరతులు లేదు. అయితే కో వాగ్జిన్ తీసుకోవాలంటే మాత్రం తమంతట తాము ఇష్టపడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్లు ఓ సర్టిఫికేట్ పై సంతకం చేయాలి.

కోవాగ్జిన్ పెట్టిన నిబంధన వల్లే చాలామందికి అనుమానాలు మొదలైపోయాయట. ఇందులో భాగంగానే ముంబాయ్ లోని జేజే హాస్పిటల్ కు కోవాగ్జిన్ వ్యాక్సిన్ చేరి పదిరోజులైంది. ఇఫ్పటికి సుమారు 100 మంది మాత్రమే వేసుకున్నారట. సుమారు వెయ్యిమందికి పైగా పనిచేసే అంత పెద్ద ఆసుపత్రిలో 10 శాతంకన్నా వేసుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉందట. కో వాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినా సిబ్బంది మాత్రం ముందుకు రాలేదట.

అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నదో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆసుపత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది తాము కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోమని కరాఖండిగా చెప్పేశారు. వైద్యుల సంఘం ఇదే విషయమై సమావేశం పెట్టుకుని ఓ తీర్మానం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవటానికి వైద్యులే నిరాకరిస్తున్నారంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్ధితేమిటి ? మొత్తానికి వ్యాక్సిన్ వేసుకోవటంలో ఆలస్యమైనా పర్వాలేదు కానీ కో వాగ్జిన్ మాత్రం వేసుకునేది లేదని తెగేసి చెబుతుండటమే విచిత్రంగా ఉంది.

This post was last modified on January 27, 2021 11:33 am

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

11 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

18 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago