Trends

ఏఐతో ఉద్యోగాలు పోతుంటే వీళ్లేమో…

ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఇద్దరు భారత సంతతి యువకులు అదే ఏఐ రంగంలో వేల కోట్లకు అధిపతులయ్యారు. సూర్య మిధా, ఆదర్శ్ హిరేమఠ్ వయసు కేవలం 23 ఏళ్లు. వీరిద్దరి సంపద ఏడాదిలోనే ఉహించని స్థాయిలో రెట్టింపైంది. ప్రస్తుతం ఒక్కొక్కరి ఆస్తుల విలువ 420 కోట్ల డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.37 వేల కోట్లకు పైమాటే. అయితే వీళ్లు సొంతంగా చాట్‌జీపీటీ లాంటి ఏఐని తయారు చేసి ఈ స్థాయికి చేరుకోలేదు.

అమెరికాలో పెరిగిన సూర్య, ఆదర్శ్ స్కూల్ రోజుల నుంచే స్నేహితులు. కాలిఫోర్నియాలోని బెల్లార్మిన్ కాలేజ్ ప్రిపరేటరీలో కలిసి చదువుకున్నారు. డిబేట్ పోటీల్లో జాతీయ స్థాయిలో విజయాలు సాధించారు. తర్వాత బ్రెండన్ ఫూడీతో కలిసి 2023లో మెర్కోర్ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఆదర్శ్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ రెండేళ్ల తర్వాత కంపెనీ కోసం చదువు మానేశాడు. సూర్య తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.

మొదట్లో మెర్కోర్ పని భారత్‌లోని ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలతో కలపడం. తర్వాత ఏఐ రంగంలోకి ప్రవేశించింది. ఏఐ వ్యవస్థలకు సరైన సమాధానాలు ఇవ్వడం నేర్పించేందుకు వైద్యులు, లాయర్లు, ఇతర నిపుణుల సేవలు అవసరమవుతాయి. అలాంటి వారిని పెద్ద ఏఐ కంపెనీలకు అందించడం, ఏఐ ఇచ్చే సమాధానాల నాణ్యతను పరీక్షించడం మెర్కోర్ ప్రధాన వ్యాపారం. ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు కూడా దీని సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

ఈ వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో మెర్కోర్ విలువ ఏడాదిలోనే 1,000 కోట్ల డాలర్ల నుంచి 2,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇటీవల ఎన్విడియా, సేల్స్‌ఫోర్స్ సహా పలువురు ఇన్వెస్టర్లు కంపెనీలో 75 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టారు. ముగ్గురు వ్యవస్థాపకులకు కంపెనీలో తలో 21 శాతం వాటా ఉంది. ఆ వాటా విలువ ఆధారంగానే ఒక్కొక్కరి సంపదను 420 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. గత ఏడాది 22 ఏళ్ల వయసులోనే ఈ ముగ్గురు ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కులైన స్వయంకృషితో ఎదిగిన బిలియనీర్లుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వందకు పైగా సంస్థలు మెర్కోర్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

This post was last modified on November 13, 2026 2:24 pm

Share

Recent Posts

పుకార్లకు మళ్ళీ రెక్కొలొచ్చాయి రుద్రా

వారణాసి విడుదల తేదీ వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడు. అంటే సరిగ్గా ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే కేవలం 145 రోజులు…

17 minutes ago

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ అదిరింది

ఇప్పుడున్న టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి అనుసరించే ప్రమోషన్ ప్లాన్లు వేరెవరు చేయలేరన్నది వాస్తవం. కాపీ చాలా మంది కొడుతున్నారు…

1 hour ago

వైసీపీ పంపేయాల‌నుకుంది.. కానీ, కియా విస్త‌రిస్తోంది!

అనంతపురంలో కియా కార్ల తయారీ రెండో ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం చేసుకోవ‌డం.. రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది.…

1 hour ago

ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. జెండాలు లేకున్నా.. అజెండాలే!

ఏపీలో ఇటీవ‌లి వ‌రకు స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేష‌న్‌, ఎంపీటీడీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల సంద‌డి కొన‌సాగింది. కొన్ని చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటు…

1 hour ago

సర్‌ప్రైజ్… దిల్ రాజుతో పవన్ సినిమా!

ఏపీ డిప్యూటీ సిఎంగా ఒకపక్క విపరీతమైన బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంకోవైపు జనసేన వ్యవహారాలతోనూ టైం లేనంతగా సతమతమవుతున్నారు.…

2 hours ago

సంక్రాంతి రేసులోకి కొత్త సినిమా?

2027 సంక్రాంతి సీజన్‌కు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ పండగ సినిమాల మీద పూర్తి స్పష్టత…

3 hours ago