Movie News

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ అదిరింది

ఇప్పుడున్న టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి అనుసరించే ప్రమోషన్ ప్లాన్లు వేరెవరు చేయలేరన్నది వాస్తవం. కాపీ చాలా మంది కొడుతున్నారు కానీ ఫలితం దక్కడం లేదు. చిరంజీవి, వెంకటేష్, రవితేజ ఇలా ఏ హీరోతో చేసినా పబ్లిసిటీ  విషయంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ దర్శకుడి కొత్త సినిమా జనవరి 12 విడుదల టైటిల్ కు తగ్గట్టే అదే డేట్ కి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అనిల్ క్రియేటివ్ స్ట్రాటజీతో రెడీ అవుతున్నట్టు సమాచారం.

నూతన సంవత్సర వేడుకలు యుఎస్ లో ప్లాన్ చేసుకుని టీమ్ మొత్తం అక్కడే సంబరాలు జరుపుకుంటోంది. అప్పటికంతా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయి ఉంటాయి కాబట్టి టికెట్ల అమ్మకాలకు ఈ ఈవెంట్లు చాలా ఉపయోగపడతాయి. పైగా వెంకటేష్ స్వయంగా హాజరై జోష్ నింపుతారు కనక అనుకున్న దానికన్నా సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. ఈ మూవీకి పోటీగా ఉన్న కాక కూడా అమెరికాలోనే సాంగ్ లాంచ్ ప్లాన్ చేసుకుంది. కానీ అది ఒక రోజుకే పరిమితం. అనిల్ టీమ్ మటుకు నాలుగైదు రోజులు ఉండబోతోంది.

తిరిగి ఇండియా రాగానే పది రోజుల పాటు నాన్ స్టాప్ మార్కెటింగ్ తో జనవరి 12 విడుదలని హోరెత్తించబోతున్నారు. ఇక్కడ ఈవెంట్లు, ప్రోమోలు, ట్రైలర్ లాంచులు, ఇంటర్వ్యూలు వగైరాలతో హైప్ ని పీక్స్ కి తీసుకెళ్ళిపోతారు. షూటింగ్ లో ఎక్కడా జాప్యం లేకుండా పరుగులు పెట్టిస్తున్న అనిల్ రావిపూడి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ పూర్తి చేశారు. సెకండాఫ్ పనులు కూడా మొదలైపోయాయి. డిసెంబర్ మూడో వారంకల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఫ్లైట్ ఎక్కేయాలనేది అనిల్ ప్రణాళికగా చెప్పొచ్చు.

వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హీరో పాత్రలు బావ బావమరిదిగా నటిస్తుండగా తోడి కోడళ్ళుగా హీరోయిన్ల మధ్య వచ్చే ఎపిసోడ్స్ హిలేరియస్ గా ఉంటాయని వినికిడి. ముఖ్యంగా ట్రైన్, హాస్పిటల్ సన్నివేశాలు ఓ రేంజ్ లో నవ్విస్తాయట. సరిలేరు నీకెవ్వరు తరహాలో హీరోలను మిలిటరీ ఆఫీసర్లుగా చూపిస్తున్నప్పటికీ వాళ్ళు రాయలసీమ వచ్చాక జరిగే ఫ్యాక్షన్ ప్లస్ కామెడీ మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు. అనిల్ అంటే అంతేమరి.

This post was last modified on November 13, 2026 4:25 pm

Share

Recent Posts

వైసీపీ పంపేయాల‌నుకుంది.. కానీ, కియా విస్త‌రిస్తోంది!

అనంతపురంలో కియా కార్ల తయారీ రెండో ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం చేసుకోవ‌డం.. రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది.…

13 minutes ago

ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. జెండాలు లేకున్నా.. అజెండాలే!

ఏపీలో ఇటీవ‌లి వ‌రకు స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేష‌న్‌, ఎంపీటీడీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల సంద‌డి కొన‌సాగింది. కొన్ని చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటు…

14 minutes ago

సర్‌ప్రైజ్… దిల్ రాజుతో పవన్ సినిమా!

ఏపీ డిప్యూటీ సిఎంగా ఒకపక్క విపరీతమైన బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంకోవైపు జనసేన వ్యవహారాలతోనూ టైం లేనంతగా సతమతమవుతున్నారు.…

35 minutes ago

సంక్రాంతి రేసులోకి కొత్త సినిమా?

2027 సంక్రాంతి సీజన్‌కు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ పండగ సినిమాల మీద పూర్తి స్పష్టత…

2 hours ago

యష్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి

2026 ఒకే సంవత్సరంలో యష్ కు రెండు విభిన్నమైన ఫలితాలు దక్కాయి. టాక్సిక్ దారుణంగా డిజాస్టర్ కావడమే కాకుండా కంటెంట్…

2 hours ago

22 కేజీలు కరిగించేసిన కీరవాణి

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని గుర్తు చేసుకోగానే భారీ అవతారం కళ్ల ముందు కదలాడుతుంది. సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన…

2 hours ago