వారణాసి విడుదల తేదీ వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడు. అంటే సరిగ్గా ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే కేవలం 145 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద ప్యాన్ వరల్డ్ మూవీకి ఇది పెద్ద టైం కాదు. షూటింట్ దాదాపు పూర్తయినా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గుమ్మడికాయ కొట్టలేదు. విఎఫ్ఎక్స్ చేస్తున్నారు. రాజమౌళి ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసుకుంటూ, ఎడిటింగ్ లో భాగమవుతూ, ఇంకోవైపు త్వరలో జరగబోయే కాలభైరవ పెళ్లిని పర్యవేక్షిస్తూ, బ్యాలన్స్ చేయడంలో ఒత్తిడిలో ఉన్నారనేది నిజం.
తాజాగా వారణాసి వాయిదా పడే సూచనలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మహేష్ బాబు అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ చాలా మంచి సీజన్. కంటెంట్ కరెక్ట్ గా పడిందా మూడు నెలలు వసూళ్లకు హద్దూపద్దూ ఉండదు. వందల వేల రికార్డులు గల్లంతవుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ ఆ టైంలో పెద్ద రిలీజులు లేవు. అన్నీ చెక్ చేసుకునే రాజమౌళి ఆ డేట్ సెట్ చేసుకున్నారు . కాబట్టి వీలైనంత వరకు ఆ తేదీ వదలకుండానే ట్రై చేస్తారు.
కాకపోతే ఇలాంటి విజువల్ గ్రాండియర్లు ఏవీ మాట మీద నిలబడే పరిస్థితులు లేవు కాబట్టి వారణాసి కన్ఫర్మ్ గా వస్తుందా అంటే ఇప్పటికైతే ఔను అని మాత్రమే చెప్పగలం కానీ గ్యారెంటీ ఎవరూ ఇవ్వలేరు. తాజాగా హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏప్రిల్ లో వస్తుందని మరోసారి చెప్పింది కానీ అన్ని వ్యవహారాలు తన పరిధిలో ఉండవు కాబట్టి ఆమె మాటనే ప్రాతిపదికగా తీసుకోలేం. సో రుద్రా అలియాస్ మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడటంలో న్యాయం ఉంది.
ఎలాగూ స్పిరిట్ వాయిదా పడింది కాబట్టి ఆ అవకాశాన్ని వారణాసి మరింత మెరుగ్గా వాడుకోవచ్చు. మార్చిలో ఫౌజీ ఉన్నా సరే ఈ రెండు సినిమాల మధ్య సుమారు ఇరవై రోజుల దాకా గ్యాప్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్, బిజినెస్ పరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. కళ్ళు చెదిరే ఓటిటి డీల్ వారణాసి సొంతమయ్యిందనే వార్త కూడా మీడియాలో తిరుగుతోంది. ఎంతనేది చెప్పాలేదు కాబట్టి ట్రిపుల్ సెంచరీ కోట్లకు దగ్గరగా ఉండొచ్చని టాక్. వారణాసి రిలీజ్ వరకు ఇలాంటివి ఎన్నెన్నో చూడాల్సి ఉంటుంది.
This post was last modified on November 13, 2026 5:26 pm
ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఇద్దరు భారత సంతతి యువకులు అదే ఏఐ రంగంలో వేల…
ఇప్పుడున్న టాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి అనుసరించే ప్రమోషన్ ప్లాన్లు వేరెవరు చేయలేరన్నది వాస్తవం. కాపీ చాలా మంది కొడుతున్నారు…
అనంతపురంలో కియా కార్ల తయారీ రెండో ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం చేసుకోవడం.. రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.…
ఏపీలో ఇటీవలి వరకు స్థానిక మునిసిపాలిటీ, కార్పొరేషన్, ఎంపీటీడీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి కొనసాగింది. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు…
ఏపీ డిప్యూటీ సిఎంగా ఒకపక్క విపరీతమైన బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇంకోవైపు జనసేన వ్యవహారాలతోనూ టైం లేనంతగా సతమతమవుతున్నారు.…
2027 సంక్రాంతి సీజన్‌కు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ పండగ సినిమాల మీద పూర్తి స్పష్టత…