కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తాను రాసుకున్న జీవిత చవిత్ర బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకంలో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ప్రస్తావించారు. రాసింది తక్కువే అయినా.. మోడీ గురించి ఆమె కీలక విషయాలను వెల్లడించారు. అంతేకాదు.. తనను-మోడీని పోల్చుకున్నారు. ఆయన సిద్ధాంతాలు వేరని.. ఆయన దృక్కోణం వేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మోడీ ఫోన్ నెంబరు కూడా తనకు తెలియదన్నారు.
సిద్ధాంత వైరుధ్యం
ప్రధాని మోడీ సిద్ధాంతాలకు.. తాను ఏర్పరుచుకున్న సిద్ధాంతాలకు మధ్య చాలా వైరుధ్యం ఉందని సోనియా చెప్పుకొచ్చారు. తన కుటుంబం.. తన వారు(అత్త, భర్త) ఈ దేశానికి చేసిన సేవ, ప్రాణత్యాగం.. కుటుంబం ఇలా… పలు అంశాలతో తన సిద్ధాంతాలు ముడిపడి ఉన్నాయన్నారు. అదేసమయంలో భారత దేశం పట్ల బాధ్యత కూడా తనకు కీలకమైందని అన్నారు. కానీ, మోడీ విషయం వేరని చెప్పారు. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలు, సిద్ధాంత కార్యకర్తల ఆలోచనల నుంచి ఆయన సిద్ధాంతాలు ఉన్నాయన్నారు.
ఇక, ప్రధానిగా నరేంద్ర మోడీ పుష్కరకాలంగా ఆ పదవిలో ఉన్నప్పటికీ.. ఆయనతో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని తెలిపారు. ఆయన ఫోన్ నెంబరు కూడా తెలియదు అని పేర్కొన్నారు. ఏనాడూ ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఆహ్వానం మేరకు వెళ్లినా.. ఏదైనా విషయంపై చర్చించినా.. వాటి వరకు మాత్రమే తాము పరిమితం అయ్యామని వివరించారు. కేవలం నమస్తే అని పలకరించుకునే వారమని సోనియా తెలిపారు.
ఉదారవాద విధానాలను భారత్ అనుసరించేదని సోనియా గుర్తు చేశారు. ప్రజాస్వామ్య ఉదార విధానమే.. భారత దేశానికి జీవనాడిగా అభివర్ణించారు. అయితే.. మోడీ హయాంలో ఈ ఉదారవాద విధానం నానాటికీ తగ్గుముఖం పట్టిందని విమర్శించారు. అయినప్పటికీ.. ఆయన దృక్కోణంలో భారత్‌ను అగ్రస్థానానికి చేర్చాలన్న కాంక్ష కనిపిస్తుందని నిర్మొహమాటంగా చెబుతున్నట్టు సోనియా పేర్కొనడం గమనార్హం. మొత్తంగా… మోడీ విషయంలో సోనియా వెల్లడించిన అంశాలు కీలకంగా మారాయి.
తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే…
అగ్రరాజ్యంలో దీపావళి సెలవు.. అనగానే మన దేశంలోనే కదా.. అమెరికాలో ఎందుకు ఉంటుంది? అక్కడి క్రిస్టియన్ నాయకులు దీపావళికి ఎందుకు…
నవంబర్ నెలలో ప్రతివారం బాక్సాఫీస్ క్లాషులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఒకేసారి మూకుమ్మడిగా కొత్త రిలీజులు దాడి చేయడం కొంత వరకు…
ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ సహా కూటమి భాగస్వామ్య…
ఇట్లు అర్జునకు ఇండస్ట్రీలో దక్కుతున్న మద్దతు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు బిగ్ షాట్స్…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…