Movie News

కంటెంట్‌ల మధ్య క్లాష్ ఇలా ఉండాలి

నవంబర్ నెలలో ప్రతివారం బాక్సాఫీస్ క్లాషులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఒకేసారి మూకుమ్మడిగా కొత్త రిలీజులు దాడి చేయడం కొంత వరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కంటెంట్‌ల మీద నమ్మకంతో నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. ఈ నెల 19, 20 తేదీల్లో నెలకొనబోయే పోటీ చూస్తుంటే అదే అనిపిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన ‘ఈ నగరానికి ఏమయ్యింది 2’ మీద మెల్లగా బజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా యూత్ కనక కనెక్ట్ అయితే వసూళ్ల లెక్కలు వేరే లెవెల్ లో ఉంటాయి.

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మీద పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి. స్వప్న సినిమా నిర్మాణ భాగస్వామ్యం వల్ల క్వాలిటీ మీద కూడా జనాల్లో నమ్మకం ఉంది. హీరోయిన్ సాత్విక వీరవల్లికి అప్పుడే మంచి ఆఫర్లు వస్తున్నాయి. బయోపిక్ అయినప్పటికీ కమర్షియల్ టచ్ తో పాటు మహానటి, సింగ్ గీతం తరహాలో ఎమోషనల్ డ్రామా చాలా బాగుంటుందని రషెస్ చూసినవాళ్లు చెబుతున్న మాట. దుల్కర్ కు బ్లాక్ బస్టర్ వచ్చి చాలా కాలమయ్యింది. దాన్ని నెరవేర్చాల్సింది ఈ మూవీనే.

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల కాంబోలో తెరకెక్కిన ‘ఓమ్’ని తక్కువ అంచనా వేయడానికి లేదు. తీసుకున్నది ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాపే అయినా టీజర్ లో రివీల్ చేయని చాలా ఎలిమెంట్స్ షాక్ ఇచ్చే స్థాయిలో ఉంటాయట. ఆ నమ్మకంతోనే ఓమ్ రెండు భాగాలుగా వస్తోంది. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాదికి రెడీ చేస్తున్నారు. సాయి అభ్యంక్కర్ సంగీతం మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెన్నై వర్గాల్లో వినిపిస్తున్న మాట. నిజమైతే ఇక్కడా ఎగబడి చూస్తారు.

అదే రోజు గాడ్జిల్లా మైనస్ జీరో పెద్ద ఎత్తున ఇండియాలో రిలీజ్ అవుతోంది. విదేశాల్లో ఇప్పటికే అదిరిపోయే వసూళ్లు చేసిన ఈ మాన్స్ టర్ డ్రామాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఇతర దేశాల్లో ఆడియన్స్ కురిపిస్తున్న ప్రశంసలు అన్ని ఇన్ని కావు. అయితే వాయిదా పడిన శర్వానంద్ భోగి కూడా ఇదే డేట్లలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని భావించా ఫైనల్ గా చివరి వారానికి షిఫ్ట్ అవ్వొచ్చని వినికిడి. రొటీన్ ఫార్ములాకు దూరంగా నవంబర్ 20 రాబోతున్న సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.

This post was last modified on November 10, 2026 5:28 pm

Share

Recent Posts

మోడీ ఫోన్ నెంబర్ కూడా సోనియా దగ్గర లేదు

కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు, రాజ్య‌స‌భ ఎంపీ సోనియాగాంధీ తాను రాసుకున్న జీవిత చ‌విత్ర బిలాంగింగ్: ఏ జ‌ర్నీ ఆఫ్ ల‌వ్‌…

3 hours ago

అమెరికాలో దీపావ‌ళికి సెల‌వు?

అగ్ర‌రాజ్యంలో దీపావ‌ళి సెల‌వు.. అన‌గానే మ‌న దేశంలోనే క‌దా.. అమెరికాలో ఎందుకు ఉంటుంది?  అక్క‌డి క్రిస్టియన్ నాయ‌కులు దీపావ‌ళికి ఎందుకు…

3 hours ago

ఆ టీడీపీ ఎమ్మెల్యేను త‌ప్పించ‌క త‌ప్ప‌దా..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ స‌హా కూటమి భాగస్వామ్య…

5 hours ago

రామ్‌చరణ్ రావడం అర్జునకి ప్లస్సవుతుందా

ఇట్లు అర్జునకు ఇండస్ట్రీలో దక్కుతున్న మద్దతు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు బిగ్ షాట్స్…

7 hours ago

పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడొద్దు – టీడీపీ, వైసీపీ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…

7 hours ago

లోక‌ల్‌ ఎఫెక్ట్‌: జ‌గ‌న్ – 2.0లో మార్పులు.. !

వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు…

7 hours ago