Trends

SRH బౌలింగ్‌లో భారీ మార్పులు.. CSKతో డీల్?

ఐపీఎల్ 2027 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తిరిగి తీసుకుంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఖలీల్ అహ్మద్‌ను కూడా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖలీల్ కోసం లియామ్ లివింగ్‌స్టోన్‌ను ఇచ్చేందుకు డీల్ మాట్లాడుతున్నట్లు సమాచారం.

ఇక నటరాజన్, ఖలీల్ ఇద్దరూ ఎడమచేతి పేసర్లే అయినప్పటికీ వారి బౌలింగ్‌లో తేడా ఉంది. ఖలీల్ కొత్త బంతితో వికెట్లు తీయగలడు. నటరాజన్ చివరి ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను కట్టడి చేయగలడు. వీరిద్దరితో పాటు పాట్ కమిన్స్‌ మరో బలం. వీరితో మూడు పేస్ బౌలింగ్ స్థానాలు భర్తీ అవుతాయి. అప్పుడు మరో పేసర్‌ను తీసుకోవాలా, స్పిన్నర్‌ను ఆడించాలా అనే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

గతంలో SRH తరఫున నటరాజన్ బాగానే రాణించాడు. 2024 ఐపీఎల్‌లో 19 వికెట్లు తీశాడు. అయితే ఢిల్లీకి వెళ్లిన తర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయాడు. గత రెండు సీజన్లలో కలిపి 12 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు ఖలీల్ కొత్త బంతితో ఉపయోగపడే బౌలర్ అయినప్పటికీ పరుగులను కట్టడి చేయడంలో కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాడు. ఇద్దరూ ఒకేసారి రాణించకపోతే SRHకు మళ్లీ పేస్ బౌలింగ్ సమస్య ఎదురవుతుంది.

ఇక లివింగ్‌స్టోన్‌ను వదులుకోవడం కూడా ఆలోచించాల్సిన విషయమే. గత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో 15 పరుగులే చేసిన అతడికి SRHలో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మిడిలార్డర్‌లో భారీ షాట్లు ఆడటంతో పాటు ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ రెండూ వేయగలడు. ఇప్పటికే హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి దూకుడైన బ్యాటర్లు ఉన్నారు. వీరిలో ఎవరైనా గాయపడినా, ఫామ్ కోల్పోయినా లివింగ్‌స్టోన్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

మరోవైపు ఖలీల్ కోసం CSK నిజంగానే లివింగ్‌స్టోన్‌ను కోరుకుంటుందా అనే విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నటరాజన్‌ను తీసుకున్న తర్వాత SRH మరో భారత పేసర్ కోసం ప్రయత్నించడం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇక హైదరాబాద్ గత సీజన్‌లో బౌలింగ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కాబట్టి ఈసారి బ్యాటింగ్ బలాన్ని కొంత తగ్గించుకుని పేసర్లపై ఎక్కువగా ఆధారపడాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది.

This post was last modified on November 3, 2026 8:31 pm

Share

Recent Posts

శ్రీలీల.. పెద్ద షాకే ఇవ్వ‌బోతోంది

కొన్ని రోజుల ముందు వ‌ర‌కు శ్రీలీల ప‌నైపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ న‌డిచింది. తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.…

1 hour ago

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారు.. ఆర్భాటాలు వ‌ద్దు..

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూట‌మి పార్టీలు ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నాయి. దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కూట‌మి పార్టీలే…

2 hours ago

హ‌మ్మ‌య్య నిలిచాం.. జ‌గ‌న్‌కు ఇదొక్క‌టే మిగిలిందా.. ?

పార్టీ ప‌రంగా గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే గొప్ప అనేలా వైసీపీ వ్య‌వ‌హారం ఉందా?…

2 hours ago

పులివెందులలో మరీ ఇంత దారుణంగా ఓడిపోయిందా?

రాష్ట్రం మొత్తంలో వైసీపీ ప‌రిస్థితి, జ‌గ‌న్ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. త‌మ‌కు పుట్టిల్ల‌యిన‌.. పులివెందుల‌లో మాత్రం ఒక ప్ర‌తిష్టాత్మ‌కం. అందుకే…

3 hours ago

ఈఎన్ఈ-3.. వ‌ద్దే వ‌ద్దు అనేసిన ద‌ర్శ‌కుడి త‌ల్లి

ఈ న‌గ‌రానికి ఏమైంది.. పెళ్ళిచూపులుతో సెన్సేష‌న్ క్రియేట్ చేశాక త‌రుణ్ భాస్క‌ర్ తీసిన సినిమా. ఎనిమిదేళ్ల కింద‌ట ఈ చిత్రం…

3 hours ago

రెబ‌ల్స్… గెలిచేశారు.. ఏం చేస్తారు?!

టీడీపీ, జ‌నసేన‌, బీజేపీ కూట‌మి ఐక్యంగా ముందుకు సాగినా.. క్షేత్ర‌స్థాయిలో నెల‌కొన్న అసంతృప్తుల కార‌ణంగా.. ఆయా పార్టీల నుంచి రెబ‌ల్స్…

4 hours ago