దక్షిణాదిన కొన్ని సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్‌కు పరిమితం అవుతుంటారు కొందరు హీరోయిన్లు. బాలీవుడ్లో కెరీర్ పుంజుకున్నాక.. మళ్లీ సౌత్ సినిమాల్లో ఛాన్సులు రావు అని ఫిక్సయిపోయాక ఇక్కడి చిత్రాల మీద విమర్శలు చేస్తుంటారు. తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలియానా, తాప్సి పన్ను లాంటి హీరోయిన్లు ఇదే పని చేశారు. రాధికా ఆప్టేది కూడాా ఇలాంటి వ్యవహారమే కానీ.. సౌత్ సినిమాల విషయంలో ఆమె చేసిన విమర్శలు, ఆరోపణలు కొంచెం భిన్నమైనవి.
తాను ఇక్కడ నటించిన ఓ సినిమాకు సంబంధించిన హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపణలు గుప్పించింది. ఇక్కడ హీరోలకు ఇచ్చే అతి ప్రాధాన్యం గురించి కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐతే కెరీర్ ఆరంభంలో ఇక్కడ కొన్ని సినిమాలు చేశాక.. మళ్లీ ఇటువైపు చూడలేదు రాధిక. ముఖ్యంగా ఆమె చేసిన ఆరోపణలు, విమర్శల తర్వాత రాధికకు ఇక్కడ ఛాన్సులు రాలేదు.
ఐతే సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో కలిసి నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ ఈ నెల 30న నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమ్ కానున్న నేపథ్యంలో దాన్ని ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాధిక సౌత్ సినిమా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను ఎక్కువ రంగు లేకపోవడం వల్లే దక్షిణాది సినిమాల్లో ఛాన్సులు ఇవ్వట్లేదని ఆమె ఆరోపించింది. నార్త్ హీరోయిన్లలో ఫెయిర్‌గా ఉన్న వాళ్లను చూసి వాళ్లకే దక్షిణాది చిత్రాల్లో అవకాశాలు ఇస్తున్నారని, తాను వాళ్లంత రంగు లేకపోవడం వల్లే అక్కడి నుంచి ఆఫర్లు రావట్లేదని ఆమె వ్యాఖ్యానించింది.
అదే సమయంలో తాను దక్షిణాది హీరోయిన్లను తక్కువ చేయనని, వాళ్లది అద్భుతమైన టాలెంట్ అని.. వాళ్ల సొంత భాషల్లో వారికే అవకాశాలు ఇవ్వాలని, డబ్బింగ్ చెప్పుకునే నార్త్ హీరోయిన్లకు ఛాన్సులు ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. రాధిక చేసిన ఈ కామెంట్ల మీద సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సౌత్ సినిమాల ఫిలిం మేకర్స్ రంగును చూసి ఛాన్సులిచ్చే రకమా.. రాధికకు ఛాన్సులివ్వకపోవడానికి తన కలర్ కారణమా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
This post was last modified on October 28, 2026 11:56 pm
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచలనం రేపాడు యువ నటుడు మౌళి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన…
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా…
ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…
తెలంగాణలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన జనసేన.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…
ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో…
ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…