గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచలనం రేపాడు యువ నటుడు మౌళి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఒక మామూలు కుర్రాడు.. ఇలా హీరో అయి తొలి సినిమాకే రూ.40 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం మామూలు విషయం కాదు. ఆ తర్వాతి సినిమా విషయంలో తొందరపడకుండా.. కొంచెం ఓపిక పట్టి, మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్లో దొంగ నా కొడుకు సినిమా చేశాడు మౌళి. నవంబరు 13న విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాకు ప్రొడక్షన్ అంతా కూడా మౌళినే దగ్గరుండి చూసుకున్నట్లు మైత్రి అధినేత రవిశంకర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇంత చేసిన మౌళికి కోటి రూపాయల పారితోషకం ఇచ్చినట్లు కొన్ని నెలల ముందే వార్త బయటికి వచ్చింది. దీంతో మౌళి అప్పుడే కోటి రూపాయల రేంజికి వెళ్లిపోయాడా అని అంతా మాట్లాడుకున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అని మౌళి నుంచి తెలుసుకుందామంటే అతను నోరు విప్పలేదు.
దొంగ నా కొడుకు టీం లేటెస్ట్ ప్రెస్ మీట్లో మౌళిని ఈ కోటి పారితోషకం గురించి అడిగితే.. తాను ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడకూడదని నిర్ణయంచుకున్నట్లు చెప్పాడు. దాని గురించి మాట్లాడితే ఫోకస్ వేరేగా వెళ్లిపోతుందని, కాబట్టి తన రెమ్యూనరేషన్ ఎంతో వెల్లడించనని అతను స్పష్టం చేశాడు. అలా అని తన రేంజ్ ఇంత అని ఎవరూ ఫిక్సయిపోవాల్సిన పని లేదని.. మంచి కథ ఉంది, ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వలేం, అసలు డబ్బులే ఇవ్వలేం అన్నా కూడా.. స్క్రిప్టు నచ్చితే సినిమా చేయడానికి రెడీ అని మౌళి చెప్పడం విశేషం.
ఇక లిటిల్ హార్ట్స్‌తో పోలిస్తే దొంగ నా కొడుకు సినిమాకు బడ్జెట్ కొంచెం ఎక్కువే అయినట్లు చెప్పిన మౌళి.. ముందు అనుకున్న మొత్తంలోనే సినిమాను పూర్తి చేసినట్లు వెల్లడించాడు. కాలేజీ టైంలో చిన్న చిన్న వీడియోలు చేసుకునే తాను.. ఈ రోజు హీరోగా నటిస్తూ, ప్రొడక్షన్ కూడా చూసుకునే స్థాయికి వచ్చానంటే కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పటికప్పుడు బయటికి రావడం వల్లే అని ఈ సందర్భంగా మౌళి వ్యాఖ్యానించాడు.
This post was last modified on October 28, 2026 11:53 pm
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా…
ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…
తెలంగాణలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన జనసేన.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…
ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో…
ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. అక్కడ ఇక్కడా అని కాకుండా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అన్నీ ప్రాంతాల్లో…