తెలంగాణలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన జనసేన.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే జరగనున్న తెలంగాణ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ పోరులో ఒక స్థానానికి జనసేన పార్టీ పోటీకి రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి. వైద్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌ను ఈ స్థానం నుంచి పోటీకి నిలబెడుతున్నారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పరిధిలోకి వచ్చే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. అయితే.. ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక.. మిత్రపక్షం బీజేపీతో కలిసి ముందుకు సాగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి.. బీజేపీకి ఈ పరిణామం సంకటంగా మారింది. జనసేనతో పొత్తు కొనసాగించాలనేది బీజేపీ వ్యూహం. గత 2024 ఏపీ ఎన్నికల్లో బీజేపీ.. జనసేనతో కలిసి పోటీ చేసింది. తద్వారా కేంద్రంలోనూ ఎంపీల మద్దతు కూడగట్టింది.
సో.. ఈ ప్రాతిపదికన.. తెలంగాణలో తమకు మద్దతు ఇవ్వాలని జనసేన కోరుతోంది. కానీ, తెలంగాణకు, ఏపీకి మధ్య వ్యత్యాసం ఉంది. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగితే.. ఆంధ్ర అనే ముద్ర పడే అవకాశం ఉంది. అలాగని జనసేనను వదిలించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అంతర్గత పొత్తుకు బీజేపీ నేతలు రెడీ అయ్యారని, దీనికి జనసేన కూడా సిద్ధమైందని అంటున్నారు. అంటే.. ఎమ్మెల్సీ స్థానానికి జనసేన తరఫున అభ్యర్థిలో బరిలో ఉంటారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించదు.
గడలకు మద్దతు.. !
గడల శ్రీనివాసరావు పేరును జనసేన ఖరారు చేసిన నేపథ్యంలో ఆయనకు బీజేపీ పరోక్షంగా మద్దతు ప్రకటించనుంది. దీంతో ఆయన జనసేన తరఫున బరిలో నిలవనున్నారు. ఈ పరిణామం బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లకు అవకాశం ఇవ్వకుండాముందుకు తీసుకువెళ్లాలని బీజేపీ కోరుతోంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పార్టీ గుర్తులతో సంబంధం ఉండదు కాబట్టి.. వ్యక్తుల ఇమేజ్, ఓటు బ్యాంక్ నెట్‌వర్క్ వంటి వాటి విషయంలో ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో జనసేన ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలవడం ఇదే తొలిసారి.
This post was last modified on October 28, 2026 10:35 pm
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచలనం రేపాడు యువ నటుడు మౌళి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన…
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా…
ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…
ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో…
ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కొనసాగింది. అక్కడ ఇక్కడా అని కాకుండా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అన్నీ ప్రాంతాల్లో…