గుట్కా నమిలి బయటకు ఉమ్మడం ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఇంటి మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్మగా, ఆ ఉమ్మి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలినట్లు సమాచారం. దీంతో విద్యుత్ షాక్కు గురైన వృద్ధుడు తీవ్రంగా కాలిపోయి మృతి చెందాడు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో మరో విషయం కూడా బయటపడింది. ఆ ప్రాంతంలో ఇళ్లకు ప్రమాదకరంగా దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లా గంజ్బసోడాలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. గాయత్రి నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్న ప్రభులాల్ గుప్తా (65) మూడో అంతస్తు బాల్కనీలో నిలబడి గుట్కా నములుతున్నాడు. ఆ తర్వాత బయటకు ఉమ్మగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఛతర్పూర్కు చెందిన ప్రభులాల్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. గత పదేళ్లుగా అదే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
అయితే ఉమ్మి ద్వారా విద్యుత్ షాక్ ఎలా తగిలిందనే విషయంపై నిపుణులు వివరణ ఇచ్చారు. మన ఉమ్మిలో నీటితో పాటు లవణాలు కూడా ఉంటాయి. అందువల్ల విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది. ఉమ్మి మధ్యలో తెగకుండా ఒకే ధారగా విద్యుత్ తీగను చేరితే దాని ద్వారా కరెంట్ శరీరానికి చేరే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే 11 కేవీ వంటి హైటెన్షన్ తీగలకు మరీ దగ్గరగా ఉన్నప్పుడు నేరుగా తాకకపోయినా గాలి ద్వారా విద్యుత్ దూకే అవకాశం ఉంటుందని వివరించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై స్థానికులు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు అతి దగ్గరగా హైటెన్షన్ తీగలు వెళ్తున్నాయని, వాటిని తొలగించాలని చాలాసార్లు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి కూడా సరిగా లేదని ఆరోపించారు. ఇంటి యజమాని పద్మా చిధర్ కూడా విద్యుత్ లైన్ను మార్చాలని అధికారులను పలుమార్లు కోరినట్లు తెలిపారు. తీగలను మరోచోటికి మారుస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
This post was last modified on October 26, 2026 11:35 am
నెలలు తరబడి సంవత్సరాలు దాటిపోయి మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. విఎఫ్ఎక్స్ వల్ల…
https://youtu.be/GBEMMz7D6C8?si=nOeiImX8VJI8Cl2H నందమూరి బాలకృష్ణతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. ఆయనది బిందాస్ జీవితం అని. దేని గురించీ…
రాన్రాను రాజకీయాల్లో విద్వేష కల్చర్ పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు విభేదాలు ఉండేవి. విధానాల పరంగా…
పుట్టి పెరిగింది కర్ణాటకలో అయినా.. సినిమాల్లో రంగప్రవేశం చేసింది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే అయినా.. శ్రీలీల అచ్చమైన తెలుగమ్మాయే. ‘పెళ్ళిసంద-డి’…
ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం.…
హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత…