Movie News

రజినీ పక్కన ఐదోసారి

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఇప్పుడు చాలా కష్టమైన వ్యవహారం అయిపోయింది. ఇంతకుముందులా పడుచు అమ్మాయిలను పెడితే.. ట్రోలింగ్ తప్పట్లేదు. అలా అని కొంచెం వయసు పెరిగిన వాళ్లను చూద్దామంటే వాళ్లలో చాలామంది ఫేడవుట్ అయిపోయి ఉంటారు. ఇలా ఆప్షన్లు తగ్గిపోవడం వల్ల కొందరు హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఉంటారు. 2000 తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అత్యధిక సినిమాలు చేసిన కథానాయిక నయనతార.

ఆమె ఇప్పటికే రజినీతో నాలుగు సినిమాలు చేశారు. తొలిసారి ‘చంద్రముఖి’లో సూపర్ స్టార్‌తో జోడీ కట్టిన నయన్.. ఆ తర్వాత కథానాయకుడులో స్పెషల్ రోల్ చేశారు. ఆపై దర్బార్, అన్నాత్తె చిత్రాల్లోనూ రజినీ సరసన నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్‌తో ఐదో సినిమాకు రెడీ అయిపోయింది నయన్. రజినీ కొత్త సినిమా ‘ధర్మన్’లో నయన్ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు అధికారికం అయింది.

‘ధర్మన్’లో నయన్ ఉన్న విషయాన్ని నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మరో సీనియర్ నటి సిమ్రన్ నటిస్తున్న విషయాన్ని లాంచ్ టైంలోనే వెల్లడించారు. ఆమెనే రజినీకి జోడీ అనుకున్నారు. కానీ ఇప్పుడు నయన్ కూడా వచ్చింది. మరి ఆమె రజినీకి జోడీగా నటిస్తుందా.. లేక ప్రత్యేక పాత్ర చేస్తోందా అన్నది చూడాలి. ఈ చిత్రంలో యువ కథానాయిక రాశి ఖన్నా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర మీద స్పష్టత లేదు.

ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ కూడా నటిస్తున్నాడు. అతను రాశికి జోడీ అంటున్నారు. తన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఓ మై కడవులే, డ్రాగన్ చిత్రాలతో ఆకట్టుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on October 26, 2026 12:48 pm

Share

Recent Posts

అప్డేట్ ఇచ్చి దొరికిపోయిన హీరో

‘కార్తికేయ-2’ మూవీతో అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఫేమ్‌ను సరిగా…

11 minutes ago

భజ గోవిందం… జనాలకు రీచ్ అయిపోయింది

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సాహిత్యం వినిపించి, సంగీతం శ్రావ్యంగా అనిపించిన పాటలు ఎన్ని ఉన్నాయంటే వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు.…

27 minutes ago

‘కేజీఎఫ్’నే కొట్టేసిన చిన్న సినిమా

ప్రేమద ఊరలి.. గత నెల రోజులుగా కన్నడ నాట ఈ చిన్న సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.…

1 hour ago

ముసుగులో గుద్దులాట వద్దు విశ్వంభరా

నెలలు తరబడి సంవత్సరాలు దాటిపోయి మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. విఎఫ్ఎక్స్ వల్ల…

1 hour ago

విద్యుత్ తీగపై గుట్కా ఉమ్మి…

గుట్కా నమిలి బయటకు ఉమ్మడం ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఇంటి మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్మగా,…

3 hours ago

బతికితే బాలయ్యలా బతకాలి

https://youtu.be/GBEMMz7D6C8?si=nOeiImX8VJI8Cl2H నందమూరి బాలకృష్ణతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. ఆయనది బిందాస్ జీవితం అని. దేని గురించీ…

4 hours ago