జూనియర్ ఎన్టీఆర్ ఎంత సరదా మనిషో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకు సన్నిహితులైన ఇండస్ట్రీ జనాలతో ఎంత ప్రేమగా ఉంటాడో.. వాళ్ల మీద కోపం వస్తే కూడా అలాగే చూపిస్తాడని అంటారు సన్నిహితులు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్‌ల మీద కూడా ఇలాంటి కోపాన్నే చూపించాడట. తన ఆగ్రహానికి కారణం.. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాకు తమన్ నుంచి త్రివిక్రమ్ ఎంతో ఆహ్లాదకరమైన పాటలు చేయించుకోవడం తారక్‌కు నచ్చలేదట.
తన సినిమా ‘అరవింద సమేత’లో అన్నీ సీరియస్ పాటలే పెట్టి.. బన్నీ సినిమాకు మాత్రం అంత ప్లెజెంట్ సాంగ్స్ చేయించుకోవడం తారక్‌కు నచ్చలేదట. ఆ విషయంలో తమ ఇద్దరి మీద తారక్ ఫైర్ అయిపోయినట్లు తమన్, త్రివిక్రమ్.. జగపతిబాబు నిర్వహించే టాక్ షోలో వెల్లడించారు. ఈ విషయమై తమన్ మాట్లాడుతూ.. ‘‘అలవైకుంఠపురములో రిలీజయ్యాక తారక్ ఫోన్ చేశాడు.
మాకేంట్రా ఏడపోయినా.. ఎప్పుడొస్తాడు.. ఎప్పుడు వెళ్లిపోతాడు.. ఇలాంటి పాటలు ఇచ్చి బన్నీకేమో సామజవరగమన, బుట్టబొమ్మా, రాములో రాములా.. ఇలాంటి పాటలు చేస్తారా అని కడిగేశాడు. తారక్ ఎలా మాట్లాడతాడో మీకు తెలుసు కదా. చాలా బావుంటుంది. క్యూటెస్ట్ వర్డ్స్’’ అని చెప్పాడు. అంతలో త్రివిక్రమ్ అందుకుని.. ‘‘మా ఇద్దరికీ తారక్ తలంటేశాడు. నాకేమో ఏడచచ్చిపోయాడు.. ఏ మట్టిలో కొట్టుకుపోయాడు.. అని పాటలు పెట్టారు.
వేసవికాలం ఎండలో నిల్చోబెట్టి.. మీద దుమ్మేసేసి నా మీద చొక్కాలు ఇప్పించేశారు అని ఫైరయ్యాడు’’ అని చెప్పాడు. ‘అజ్ఞాతవాసి’తో దారుణ పరాజయాన్ని అందుకున్న అనంతరం త్రివిక్రమ్ పూర్తిగా రూటు మార్చి తారక్‌తో ‘అరవింద సమేత’ లాంటి సీరియస్ మూవీ తీసి మంచి విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత ఆయన తీసిన ‘అల వైకుంఠపురములో’ ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది.
This post was last modified on October 26, 2026 4:39 pm
ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్…
టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్యా లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ లోటు కనిపించేది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారీ షాట్లు…
ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులేమైనా అవసరం అనుకుంటే అవి…
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ…
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మోగ్రఫీలో ‘అరవింద సమేత’ చాలా స్పెషల్. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రివిక్రమ్.. ఈ సినిమాలో పూర్తిగా రూటు మార్చేశాడు.…
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫౌజీ టీజర్ పెద్ద దుమారమే రేపేలా ఉంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని…