Trends

పెళ్లి కోసం హ‌త్య‌: 23 ఏళ్లుగా ప్రేమ ఖైదీలు!

ఆ యువ‌తీ యువ‌కులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డ‌దామ‌ని అనుకున్నారు. కానీ, విధి వ‌క్రించింది. ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేశారు. దీంతో స‌ద‌రు పెళ్లి కాస్తా నిలిచిపోగా.. 23 ఏళ్లుగా ప్రేయ‌సీ ప్రియులు జైల్లోనే మ‌గ్గుతున్నారు. ప్ర‌స్తుతం వారిలో ప్రియుడి వ‌య‌సు.. 50 ఏళ్లుకాగా, ప్రియురాలి వ‌య‌సు 48 ఏళ్లు. అయినా.. వీరికి ఎలాంటి మ‌న‌స్సాంతి లేదు. ఎందుకంటే.. వారికి ప‌డిన శిక్ష‌.. జీవిత ఖైదు!.

ఏం జ‌రిగింది?

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు చెందిన‌ శుభ‌, అరుణ్‌లు ప్రేమించుకున్నారు. 2003లోనే వారు వివాహం చేసుకు నేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో ఇంట్లో వారికిచెబితే కాదంటార‌ని భావించిన శుభ‌.. అరుణ్‌లు ర‌హ‌స్యంగానే వివాహం చేసుకుందామ‌ని.. అయితే కొన్నాళ్లు ఆగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అప్ప‌టికి శుభ లా చ‌దువుతోంది. అరుణ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంత‌లో శుభ కుటుంబ స‌భ్యులు ఆమెకు వివాహం నిర్ణ‌యించారు. గిరీష్ అనే అబ్బాయితో ఏకంగా నిశ్చితార్థం కూడా పెట్టేశారు.

ఇంకేముంది.. శుభ‌, అరుణ్‌ల‌లో ఆందోళ‌న ప్రారంభ‌మైంది. పోనీ.. వారు పారిపోయి వివాహం చేసుకున్నా.. హ్యాపీగా ఉండేవారేమో?!. కానీ, ఇక్క‌డే త‌ప్ప‌ట‌డుగు వేసి.. ప్రాణాలు తీశారు. నిశ్చితార్థం జ‌రిగిన గిరీష్‌ను శుభ ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. బెంగ‌ళూరులోని రింగు రోడ్డు వ‌ద్ద‌కు ఓ అర్ధ‌రాత్రి ర‌ప్పించింది. కారులో వ‌చ్చిన అత‌నితో క‌లిసి మూడు రౌండ్లు త‌ను కూడా కారులో చ‌క్క‌ర్లు కొట్టింది. అనంత‌రం.. గ‌గ‌న‌తలంలో తిరుగుతున్న విమానాల‌ను చూద్దామంటూ.. కారులో నుంచి గిరీష్‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చింది.

ఇక‌, ఈ స‌మ‌యం కోస‌మే ఎదురు చూస్తున్న శుభ ప్రియుడు.. అరుణ్ .. గిరీష్‌పై దాడి చేసి కొట్టి చంపేశాడు. దీనికి గాను బైక్‌ల షేక్ అబ్జార్బ‌ర్‌ల‌ను వినియోగించారు. ఈ ఘ‌ట‌న‌లో గిరీష్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకేముంది.. ముంద‌స్తు ప్లాన్లో భాగంగా ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌మాదంగా చిత్రీక‌రించి.. తాము రెండు మూడురోజుల్లో వివాహం చేసుకోవాల‌ని శుభ‌, అరుణ్‌లు నిర్ణ‌యించుకున్నారు. కానీ, క‌థ అడ్డం తిరిగి.. ఇద్ద‌రూ దొరికి పోయారు. అప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు కూడా వారు జైల్లోనే ఉన్నారు.

ఈ కేసును స‌మ‌గ్రంగా విచారించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు.. శుభ‌, అరుణ్‌ల‌కు జీవిత ఖైదు విధించాయి. అనంతరం.. శుభ ఈ వ్య‌వ‌హారంపై క్ష‌మాభిక్ష పిటిష‌న్ వేసింది. త‌మ ఉద్రోకంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని.. కావాలని చేయ‌లేద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ పిటిష‌న్‌.. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఉంది. అయితే.. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష‌కు అనుకూలంగా ఉంటే గ‌వ‌ర్న‌ర్ ఆమేర‌కు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. కానీ, సీఎం డీకే శివ‌కుమార్ మాత్రం దీనికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇలాంటి వారు జైల్లోనే మ‌గ్గిపోతే త‌ప్ప‌.. స‌మాజానికి స‌రైన సంకేతాలు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా.. ప్ర‌స్తుతం శుభ వ‌య‌సు 48 ఏళ్లు, అరుణ్ వ‌య‌సు 50 ఏళ్లు. ఈ ప్రేమికులు ఎప్ప‌టికి బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.

This post was last modified on October 16, 2026 12:18 pm

Share

Recent Posts

అనిరుధ్, కావ్య పెళ్లి విందుకు రండి

అనిరుధ్ ర‌విచంద‌ర్ పేరుకు త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడే కానీ.. ప్ర‌స్తుతం ఇండియాలో అత‌నే నంబ‌ర్ వ‌న్ అన‌డంలో ఎవ‌రికీ సందేహాలు…

22 minutes ago

నాగార్జున మళ్ళీ పంచులు వేశారు

కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…

2 hours ago

ఏపీలో నామినేష‌న్ల తొలిరోజు: ర‌ణ‌రంగ‌మే!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శుక్ర‌వారం తెర‌దీశారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే.. తొలిరోజే ఉమ్మ‌డి క‌డ‌ప, ఉమ్మ‌డి…

3 hours ago

సీబీఐకి సాయికృష్ణ కేసు: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్ట‌రీ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు…

4 hours ago

జైలర్ 2 కత్తిరింపుల మీద అనుమానాలు

నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…

4 hours ago

లేడీ విలన్‌ని వాడుకోవడం ఒక కళ

తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…

6 hours ago