నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా పనులు పెండింగ్ ఉండటం వల్ల కొత్త డేట్ కోసం చూస్తున్నారని, అక్టోబర్ 23 లేదా 30 ఈ రెండు తేదీల్లో ఒకదాన్ని ఎంచుకునేలా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారని సమాచారం వచ్చింది. అయితే బంగారం లాంటి పండగ సీజన్ మిస్ చేసుకుని తర్వాత తాపీగా వస్తామని చెప్పడం గురించి దగ్గుబాటి అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతూ ఆన్ లైన్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఒక పెద్ద సినిమా పదే పదే పోస్ట్ పోన్ కావడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీడియం బడ్జెట్ సినిమాలు పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే ఒకవేళ అక్టోబర్ 30 కనక ఆదర్శ కుటుంబం ఎంచుకుంటే ఆల్రెడీ ఆ స్లాట్ తీసుకున్న మూడు చిత్రాలు ఇబ్బందుల్లో పడతాయి. సితార సంస్థే నిర్మించిన రోషన్ మేక ‘ఏమో ఏమో ఇది’ ఖచ్చితంగా తప్పుకోవాల్సి ఉంటుంది. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కల్ట్’ కూడా అదే డేట్ అఫీషియల్ గా లాక్ చేసుకుంది.
కొత్త హీరో ఉన్నప్పటికీ బలమైన టీమ్ తో ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చిన ‘ఇట్లు అర్జున’ సైతం డోలాయమానంలో పడుతుంది. అలాని వీళ్ళు దీపావళికి వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్లాట్ లో ప్యాన్ ఇండియా మూవీ రామాయణతో పాటు సూర్య సీన్ లాంటి క్రేజీ మూవీస్ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. అందుకే నవంబర్ లాస్ట్ వీక్ సేఫ్ ఆప్షన్ అవుతుంది. కానీ ఆదర్శ కుటుంబం కనక ఆ నిర్ణయం తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ముగ్గురు హీరోలు, దర్శకులు చవి చూడాలి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంత ఒత్తిడి మధ్య క్వాలిటీ ఏ మాత్రం అటు ఇటు అయినా దాని వల్ల అందరూ బాధ పడాల్సి వస్తుందని ఎడిటింగ్ దగ్గరి నుంచి రీ రికార్డింగ్ దాకా అన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని తెలిసింది. అక్టోబర్ 23 మంచి ఛాయసే కానీ అప్పటికైనా వర్క్స్ అయిపోతాయా అంటే టీమ్ సమాధానం చెప్పలేని సిచువేషన్ లో ఉంది. ఏంటో ఇది ఎప్పటికి తేలుతుందో మరి.
This post was last modified on October 5, 2026 10:58 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…