Trends

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్ గేట్ల వ‌ద్ద రుసుములు చెల్లించిన త‌ర్వాత‌.. వాహ‌నాలు ముందుకు క‌దులుతాయి. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు రుసుములు తీసుకుని వాహ‌న‌దారుల‌కు చిల్ల‌ర ఇచ్చి.. టికెట్ ఇచ్చే వ‌ర‌కు వెనుక ఉన్న వాహ‌నాలు నిరీక్షించ‌క త‌ప్పేది కాదు. ఈ ప్ర‌క్రియ‌లో క‌నీసం ఒక్కొక్క వాహ‌నం ప‌ది నిమిషాల చొప్పున నిరీక్షించాల్సి ఉంటుంది.

అయితే.. ఇప్పుడు కొంత మేర‌కు ఫాస్ట్ ట్యాగ్ వ‌చ్చింది. దీంతో ఈ నిరీక్ష‌ణ స‌మ‌యం త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ.. బారికేడ్ల ఏర్పాటును మాత్రం కొన‌సాగిస్తున్నారు. అంటే.. టోల్ ప్లాజాల వ‌ద్ద‌.. ఎంత ఫాస్టాగ్ ఉన్న‌ప్ప‌టికీ.. మ‌లుపుల మాదిరిగా ఉండే బారికేడ్ల‌ను దాటుకుని.. వాహ‌నాలు ముందుకు క‌దులుతున్నాయి. ఇది కూడా.. ఐదు నిమిషాల స‌మ‌యాన్ని తినేస్తోంది. పైగా.. ఈ స‌మ‌యంలో పెట్రోల్‌, డీజిల్ వంటి ఇంధ‌న వినియోగం కూడా పెరిగిపోతోంది. దీనిపై ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారుల సంస్థ(ఎన్‌హెచ్ఏఐ) అధికారులు నివేదిక‌ల‌ను కేంద్రానికి స‌మ‌ర్పించారు.

దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన ప్ర‌భుత్వం.. ఇక నుంచి హైవేల‌పై బారికేడ్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసేందుకు నిర్ణ‌యం తీసుకునేలా ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ ఇప్ప‌టికే త‌న మ‌ధ్యంత‌ర నివేదిక‌ను ర‌హ‌దారుల శాఖ‌కు అప్ప‌గిం చింది. దీని ప్ర‌కారం జాతీయ ర‌హ‌దారుల‌పై బారికేడ్ల‌ను తీసేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. వ‌చ్చే మార్చి నుంచి దేశ‌వ్యాప్తంగా అన్ని జాతీయ ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ ప్లాజాల వ‌ద్ద బారికేడ్ల‌ను ఎత్తేయ‌నున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ఏంటి లాభం?
1) టోల్‌ప్లాజాల వద్ద వేచి చూసే సమయం మ‌రింత త‌గ్గుతుంది.
2) అసలు ఆగే అవసరమే ఉండదు.
3) దీనివల్ల సమయం ఆదా అవుతుంది.
4) ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయం స‌ర్కారుకు ల‌భిస్తుంది.
5) ఏడాదికి సుమారు రూ.5,250 కోట్ల మేర పెట్రోల్‌/  డీజిల్‌ కూడా ఆదా అవుతుంది.

This post was last modified on September 11, 2026 11:05 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

1 hour ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

5 hours ago