అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నో పొగిడితేనో.. తాను వాళ్ల ఫ్యాన్ అని చెప్పుకుంటేనో అది పెద్ద విషయంగా ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. బన్నీ మెగా గొడుగు నుంచి బయటికి వచ్చేశాడు. అతను మెగా అనే పదమే వాడట్లేదు. తన అభిమానులను మెగా ఫ్యాన్స్ అని సంబోధించడం లేదు. ఆర్మీ అంటూ ప్రత్యేకంగా పిలుచుకుంటున్నాడు. అల్లు బ్రాండునే ప్రమోట్ చేసుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో బన్నీ.. చిరు సహా మెగా హీరోల్లో ఎవరి గురించి మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా అది ఆసక్తి రేకెత్తిస్తోంది. శనివారం చిరు 71వ పుట్టిన రోజును పురస్కరించుకుని బన్నీ విషెస్ చెబుతూ ఒక పోస్టు పెడితే.. అది వైరల్ అయిపోయింది. ఐతే చిరుకు బన్నీ విషెస్‌లో ప్రత్యేకత ఏమీ లేదు కానీ.. ఈ పోస్టు కింత అతను వాడిన హ్యాష్ ట్యాగ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
#KKAVCF.. ఇదీ బన్నీ వాడిన హ్యాష్ ట్యాగ్. ముందు ఇదేంటో జనాలకు అర్థం కాలేదు. కానీ కాస్త ఆలోచిస్తే.. గతంలో బన్నీ చేసిన ఒక కామెంట్‌ను గుర్తు చేసుకుంటే సోషల్ మీడియా జనాలకు విషయం బోధపడింది. దీనికి అర్థం.. కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యానే. మెగా అభిమానులు చిరు పట్ల తన విధేయతను శంకిస్తున్న సమయంలో బన్నీ ఒక ఈవెంట్లో ఈ కామెంట్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ కామెంట్‌ను గుర్తు చేసేలా హ్యాష్ ట్యాగ్ పెట్టి తాను ఎప్పటికీ చిరు అభిమానినే అని తేల్చాడు బన్నీ. చిరు, బన్నీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశారు.
కొందరు మెగా అభిమానులు ఇప్పటికీ బన్నీని అనుమానంగానే చూస్తున్నా.. మిగతా వాళ్లు మాత్రం అతడి పోస్టుకు సానుకూలంగా స్పందిస్తూ కొనియాడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాక బన్నీలో చాలా మార్పు వచ్చేసిందని.. చిరు, పవన్‌లను లెక్క చేయట్లేదని మెగా అభిమానుల్లో ఒక వర్గం అతడి మీద ఎప్పుడూ ఎటాక్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో బన్నీ ఫ్యాన్స్ సైతం వారి మీద ఎదురుదాడి చేస్తుంటారు. వీరి మధ్య తరచుగా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో బన్నీ వాడిన హ్యాష్ ట్యాగ్ చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on August 22, 2026 11:20 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…