Movie News

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది వెంటనే చెప్పలేం కానీ వీకెండ్ దాకా రవితేజ ర్యాంపేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాలకు నోట మాట రావడం లేదు. విజయం ఊహించిందే కానీ మరీ ఇంత బ్లాక్ బస్టర్ అనుకోలేదని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. కొన్ని ఏరియాలు రీజనబుల్ రేట్ కు ఇచ్చేయడం వల్ల మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాలు వచ్చేస్తున్నాయి.

ఇంత ఇరుముడి ప్రభంజనంలోనూ విశ్వనాథ్ అండ్ సన్స్ తట్టుకుని నిలవడం విశేషమని చెప్పాలి. బుక్ మై షో ట్రెండింగ్ తో పాటు మెయిన్ సెంటర్స్ అన్నింటిలో మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. రెండో వారానికి ముందే ప్రిపేర్ అయిన నిర్మాత నాగవంశీ తగినన్ని థియేటర్లు హోల్డ్ చేయడం చాలా ప్లస్ అవుతోంది. కంటెంట్ మీద నమ్మకంతో అలా అగ్రిమెంట్లు చేయడం వల్ల విశ్వనాథ్ అండ్ సన్స్ రెండో వారంలో ఎక్కువ స్క్రీన్లలో తీసేయాల్సిన అవసరం పడలేదు.

సూర్య సినిమాకున్న ప్రధానమైన అడ్వాంటేజ్ జానర్. ఇరుముడి ఎంతగా ఆకట్టుకుంటున్నా అది డివోషన్ కలిసిన క్రైమ్ థ్రిల్లర్. సున్నిత మనస్కులు చూడలేని ఒప్పుకోలేని కొన్ని అంశాలున్నాయి. ఇవి వద్దనుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా విశ్వనాథ్ అండ్ సన్స్ కు ఓటేస్తున్నారు. ఇది అర్థం కావాలంటే హైదరాబాద్, జిల్లా కేంద్రాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ మన దగ్గర గ్రౌండ్ లెవెల్ వరకు అందరికీ చేరుకుందనేది వాస్తవం.

అయితే సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఎటు వెళ్తుందో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 26 టాక్సిక్ దిగుతుంది. ఇరుముడి సెకండ్ వీక్ లోనూ బలంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ నెమ్మదించే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇప్పటికే ప్రాఫిట్స్ లో ఉంది కాబట్టి టెన్షన్ లేదు. ఏపీ తెలంగాణ వరకు సూపర్ హిట్ ముద్ర వేసేసుకుంది. ఎటొచ్చి తమిళంలోనే కొంచెం నెమ్మదిగా ఉంది. 

This post was last modified on August 22, 2026 11:01 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago