Trends

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి. కొన్ని చోట్ల అయితే, కోతుల బెడద తీవ్రంగా ఉంటూ మనుషులపై దాడులు చేస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. దీంతో, కోతుల బెడద లేకుండా చేస్తామంటూ రాజకీయ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో హామీలిచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.

చాలా పట్టణాల్లో కోతులను పట్టుకొని అడవులలో వదిలివేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలా ఇండియాలో జనం కోతులు మాకొద్దు మహా ప్రభో అంటోంటో…చైనా మాత్రం కోతులు కావాలంటోంది. అంతేకాదు, అక్షరాలా పాతిక లక్షలు పెట్టి మరీ ఒక్కో కోతిని కొంటామని చెబుతోంది.

చైనాలో కోతుల కొరత ఉంది. దీంతో, కంబోడియా నుంచి ఒక్కో కోతి 25 లక్షలు పెట్టి కొంటోంది. ఎనిమిది సంవత్సరాల క్రితం సుమారు రెండు లక్షలు ఉన్న కోతి ధర ఇప్పుడు ఏకంగా పాతిక లక్షలకు ఎగబాకింది. అయితే, చైనాలో కోతుల డిమాండ్..సప్లై నేపథ్యంలో ఈ ధరకు రెక్కలొచ్చాయి. బయోటెక్, ఫార్మా కంపెనీలు తయారు చేసిన మందులను ముందు వాటిని కోతులపై పరీక్షిస్తారు. ఇలా ట్రయల్స్ వేసేందుకు వారికి క్రాప్ ఈటింగ్ మఖాక్ జాతి కోతులు అవసరం. ఆ కోతుల శరీ మనుషులను పోలి ఉండడమే అందుకు కారణం.

అయితే, కోవిడ్ సమయంలో వన్యప్రాణుల వ్యాపారులపై చైనా సర్కార్ ఆంక్షలు విధించింది. అదీగాక మఖాక్ కోతులకు వేరే ప్రత్యామ్నాయాలు లేవు. దీంతో, డిమాండ్ పెగింది. 2028 వరకు ప్రతి ఏటా 20 వేల కోతులు కొరత ఉండొచ్చని అంచనా. త్వరలోనే ఒక కోతి ధర 30 లక్షలకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దీంతో, జాయిన్ లేబరేటరీస్ అనే సంస్థ ఎక్కువ సంఖ్యలో కోతులు కొని స్టాక్ పెట్టుకుంది. దీంతో, ఆ కంపెనీ షేర్ ల విలువ 1000 కోట్లకు పెరిగింది.

This post was last modified on August 22, 2026 8:04 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

4 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

4 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

4 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

7 hours ago