Trends

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఓ రేంజిలో సత్తా చాటుతున్న భారతీయులు… అందులోనూ తెలుగు వారి తిప్పలు వర్ణనాతీతమనే చెప్పాలి. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కాగా… తమ మాతృభూమిలో వివాహం చేసుకోవాలని భావించిన తెలుగు జంట వీడియో కాల్ లోనే నిశ్చితార్థం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆగస్టులో జరగనున్న వీరి వివాహం కూడా అక్కడే జరగనుండగా… ఆ పెళ్లి వేడుకకు అయినా వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు హాజరవుతారో, లేదో చూడాలి.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఏపీలోని రాయలసీమ ముఖ ద్వారా కర్నూలు నగరానికి చెందిన ఓ యువకుడు, అతడు, అతడితో వివాహం నిశ్చయమైన యువతి అమెరికాలోనే ఉన్నారు. వివాహం ఖరారైన నేపథ్యంలో కర్నూలు వచ్చి ఘనంగా నిశ్చితార్థంతో పాటుగా వివాహ వేడుకను అంగరంగవైభవంగా చేసుకోవాలని ఆ జంట భావించింది. అయితే ట్రంప్ పుణ్యమా అని అమెరికాలో వీసా నిబంధనలు కఠినం కాగా… వారిద్దరూ భారత్ రావడానికి వీలు కాలేదు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు అక్కడికి చేరడానికి కుదర్లేదు. దీంతో వీడియో కాల్ నిశ్చితార్ధం చేసుకోవడం మినహా వారికి వేరే మార్గం కనిపించలేదు.

అనుకున్నదే తడవుగా ముందుగా నిర్దేశించుకున్న ముహూర్తానికే ఆ జంట నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అమెరికాలోని మిస్ కాన్సిన్ స్టేట్ లో ఉంటున్న ఆ జంట అక్కడే నిశ్చితార్థ వేడుకను నిర్వహించుకుంది. ఈ కార్యక్రమాన్ని వారు వీడియో కాల్ ద్వారా తమ తల్లిదండ్రులకు చూపించారు. ఈ వేడుకను బంధుమిత్రులతో కలిసి వీక్షించేందుకు ఆ జంట కుటుంబం కర్నూలులోని ఓ ప్రైవేట్ హోటల్ లో బారీ ఏర్పాట్లు చేసింది. బంధుమిత్రులంతా ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు హోటల్ లో భారీ స్ర్రీన్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కర్నూలు నుంచే ఆ జంట నిశ్చితార్ధ వేడుకకు వేదమంత్రాలను చదివేలా పండితులను ఏర్పాటు చేసింది.

కర్నూలులో వేదపండితుల మంత్రోచ్ఛారణలు పలుకగా… మిస్ కాన్సిన్ స్టేట్ లో ఆ జంట ఉంగరాలు మార్చుకుంది. పూల దండలూ మార్చుకుంది. ఆన్ లైన్ లో అయినా ఈ వేడుక ఘనంగానే జరిగింది. నిశ్చితార్థాన్ని ఇలా ఆన్ లైన్ లో చేసుకున్న ఈ జంట ఆగస్టు 30న అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. మరి ఈ వేడుకకు అయినా ఆ జంట తల్లిదండ్రులు, బంధుమిత్రుల మధ్య జరుపుకుంటుందో…లేదంటే నిశ్చితార్థం మాదిరే వీడియో కాల్ నే ఆశ్రయించాల్సి వస్తుందో చూడాలి.

This post was last modified on July 11, 2026 4:22 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

18 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

19 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago