బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లికొడుకు అయ్యారు. కొన్నేళ్ల నుంచి ఆయన రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌరీ స్ప్రాట్‌ను ఆదివారం ముంబయిలోని తన నివాసంలో ఆమిర్ పెళ్లి చేసుకున్నారు. పెద్దగా హడావుడి లేకుండా.. తక్కువమంది కుటుంబ సభ్యులు, అతిథుల మధ్య ఆమిర్, గౌరీల పెళ్లి జరిగింది.
సంప్రదాయ పద్ధతిలో కాకుండా.. సింపుల్‌గా ఈ వివాహాన్ని ముగించారు. పెళ్లికి సంబంధించి అధికారిక పత్రాలపై ఇద్దరూ సంతకాలు చేయడం ద్వారా ఆమిర్, గౌరీ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
ఆమిర్ ఇద్దరు తనయులు జునైద్ ఖాన్ (రీనా దత్తాతో కలిగిన సంతానం), ఆజాద్ రావ్ ఖాన్ (కిరణ్ రావుతో కలిగిన కొడుకు).. గౌరీ తనయుడు.. ఆమిర్, రీనాల తనయురాలు ఇరా ఖాన్‌ల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు కాకుండా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో పాటు కొందరు అతిథులు మాత్రమే ఆమిర్ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించి ఫొటోలు, వీడియోలను ఆమిర్ టీం సోషల్ మీడియాలో పంచుకుంది.
ఆమిర్ తొలిసారిగా 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి 2002లో విడిపోయిన ఆమిర్.. తనతో కలిసి కొన్ని సినిమాలకు పని చేసిన కిరణ్ రావును 2005లో పెళ్లాడాడు. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ పలు చిత్రాలకు కలిసి పని చేశారు. ఈ జంట 2021లో విడిపోయింది. తర్వాత కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న ఆమిర్.. చాలా ఏళ్ల నుంచి తనకు స్నేహం ఉన్న గౌరీ స్ప్రాట్‌తో మూడేళ్ల ముందు రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాడు.
గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా గౌరీతో తన బంధం గురించి మీడియాకు వెల్లడించిన ఆమిర్.. ఇప్పుడు ఆమెతో వివాహ బంధంలోకి వెళ్లాడు. తన మాజీ భార్యలిద్దరితోనూ ఆమిర్‌కు ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. ఇటీవల ఆమిర్, గౌరీ, రీనా, కిరణ్ కలిసి ఒకే కారులో ప్రయాణించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమిర్, గౌరీ పెళ్లికి కూడా ఈ ఇద్దరూ హాజరవుతారని వార్తలు రాగా.. ఇంకా సంబంధిత ఫొటోలేవీ సోషల్ మీడియాలోకి రాలేదు.
This post was last modified on July 5, 2026 7:13 pm
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…