సినిమా స్టార్ల కొడుకులు ఈజీగానే హీరోలు అయిపోతారు. వాళ్లు కూడా స్టార్లుగా ఎదిగిపోతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడటం, సినిమాల నుంచి వైదొలగడం చేస్తుంటారు. ఇక్కడ లుక్స్ ఎలా ఉన్నా.. పెద్దగా టాలెంట్ లేకపోయినా కూడా నడుస్తుంది కానీ.. ఆటల్లో అలా కుదరదు. ముఖ్యంగా క్రికెట్లో స్టార్ ఆటగాళ్ల వారసత్వాన్నందుకుని కెరీర్ ఆరంభించిన వాళ్లలో తమ తండ్రుల స్థాయికి ఎదిగిన వాళ్లు దాదాపుగా కనిపించరు.
దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్.. భారత్ తరఫున కొన్ని మ్యాచ్‌లైతే ఆడాడు కానీ.. ఎంతో కాలం జట్టులో ఉండలేకపోయాడు. తర్వాతి తరంలో మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ కూడా తన కొడుకు అర్జున్ తెందుల్కర్‌ను క్రికెటర్‌గా నిలబెట్టలేకపోయాడు.
సచిన్ 16 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చేశాడు. టీనేజీలోనే సంచలన ప్రదర్శనలతో ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ 21 ఏళ్లు వచ్చినా కనీసం ముంబయి సీనియర్ జట్టులో సంపాదించలేని స్థితిలో ఉన్నాడు అర్జున్. ఇప్పటిదాకా అతను అండర్-19, అండర్-23 టోర్నీల్లో ముంబయికి ఆడాడు కానీ.. సీనియర్ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు.
భారత జట్టులోకి రావడానికి మార్గాలైన రంజీ, విజయ్ హజారె, ముస్తాక్ అలీ లాంటి టోర్నీలో ఆడే అవకాశం సంపాదించలేకపోయాడు. ఐతే ఎట్టకేలకు ముంబయి సీనియర్ జట్టులో అతడికి చోటు లభించింది. ఈ నెల 10 నుంచి మొదలయ్యే ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం ఎంపిక చేసిన ముంబయి జట్టులో అర్జున్‌కు చోటిచ్చారు.
కానీ అర్జున్ ప్రతిభను బట్టి చూస్తే జట్టులో చోటుకు అర్హుడు కాదని, కొంచెం గ్రేస్ మార్కులు వేసి అతడికి ముంబయి టీ20 జట్టులో చోటిచ్చారని అంటున్నారు. అండర్-19, 23 టోర్నీల్లో అర్జున్ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. ఇప్పటిదాకా ఐపీఎల్ వేలంలోకి కూడా అతను రాలేకపోయాడు. ముందు బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ఆరంభించిన అర్జున్.. ఆ విభాగంలో సత్తా చాటలేకపోయాడు. దీంతో తర్వాత అతను ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. ఇప్పుడు ప్రధానంగా బౌలింగ్, కొద్దిగా బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్ పాత్రలో కొనసాగుతున్నాడు. మరి ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తుది జట్టులో అర్జున్‌కు చోటు దక్కుతుందా.. అవకాశం వస్తే ఏమైనా పెర్ఫామ్ చేస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on January 3, 2021 12:46 pm
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే……
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం…
దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి పోయింది. పార్లమెంటులోని దిగువ…
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే మొన్నామధ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్…
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…