2020 వెళ్లిపోయింది. ఎన్నో ఆశలతో మేజిక్ ఫిగర్ లాంటి ఇయర్ లో తమకు మర్చిపోలేని ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా కరోనాతో వణికించి వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్తగా ఏమైనా ఉంటుందా? అంటే.. నో చెప్పేస్తున్నాయి ఐటీ కంపెనీలు. 2020 ప్రభావం 2021 మీద కూడా ఉంటుందని తేలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచి పని చేసే విషయంలో కంపెనీలన్ని దాదాపుగా ఒకేలా ఆలోచిస్తున్నాయి.
హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైసెస్ అసోసియేషన్ (షార్ట్ కట్ లో చెప్పాలంటే హైసియా) తాజాగా ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం వర్కు ఫ్రంట్ ఆఫీస్ అన్నది ఇప్పట్లో సాధ్యం కాదని పలు కంపెనీలు తేల్చేశాయి. అయితే.. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మంది మాత్రం ఆఫీసు నుంచి పని చేయక తప్పదని తేల్చారు. సర్వేలో భాగంగా 500 లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలతో పాటు.. 1000కు పైనే ఉద్యోగులు ఉన్న కంపెనీల అభిప్రాయాల్ని సేకరించారు. వీరంతా చెప్పిన దాని ప్రకారం.. గడిచిన 9 నెలల్లో చాలా కంపెనీలు తామున్న ఆఫీస్ స్పేస్ ను తగ్గించుకున్నాయి. దీంతో.. ఇప్పటికిప్పుడు గతంలో మాదిరి ఆఫీసులకు ఉద్యోగుల్ని తీసుకొచ్చే ఆలోచన చేయటం లేదు.
దీనికి కారణం లేకపోలేదు. ఇంటి నుంచి పని చేసే విషయంలో ఉద్యోగుల ఉత్పాదకత మెరుగ్గా ఉండటమే. ఆఫీసు నుంచి పని చేసే దానితో పోలిస్తే.. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల ఉత్పాదకత 90 శాతానికి పైగా బాగుండటంతో.. ఇదే విధానాన్ని మరికొంత కాలం కంటిన్యూ చేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకత 100 శాతానికి పైనే నమోదుకావటంతో.. వర్కు ఫ్రంట్ హోంకు మించింది లేదన్న భావన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది మార్చి నాటికి 20 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేసేలా ప్రణాళికల్ని కొన్ని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఈ ఏడాది చివరికి 50 – 70 శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చి పని చేయాలని భావిస్తున్నారు. గతంలో మాదిరి నూటికి నూరుశాతం వర్కు ఫ్రంట్ ఆఫీసు అన్న విషయాన్ని మాత్రం ఏ కంపెనీ కూడా చెప్పకపోవటం గమనార్హం. అత్యవసర విభాగాలు.. కీలక ఉద్యోగుల్ని మాత్రమే ఆఫీసు నుంచి పని చేయిస్తున్నట్లుగా 75 శాతం పెద్ద కంపెనీలు పేర్కొన్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం రోటేషన్ లో భాగంగా.. క్లయింట్ల అవసరాలకు తగ్గట్లు వారంలో కొన్ని రోజులు ఆఫీసులో పని చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. మొత్తంగా.. వర్కు ఫ్రం హోం ఈ ఏడాది వరకు కొనసాగటం ఖాయంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on January 2, 2021 8:37 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…