నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ నగరాన్ని వణికించేసింది. ఆ యువతిని ప్రేమించిన ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువుగా మారి నడిరోడ్డుపై పోరాడుకున్నారు. ఈ పోరాటం కర్రలతోనే, కత్తులతోనే జరగలేదు. అత్యాధునిక థార్ కార్లతో జరిగింది. ఒక కారులో ఒకరు…మరో కారులో మరొకరు కూర్చుని వారిద్దరూ పరస్పరం కార్లతోనే డీకొట్టుకున్నారు. వెరసి ఈ ఘర్షణతో నెలకొన్న శబ్ధాలతో బెజవాడ నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. చివరాఖరుకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే…గురునానక్ కాలనీకి చెందిన ఓం, రోహిత్ లు ఇద్దరూ స్నేహితులు. నగరంలోని భారతీ నగర్ కు చెందిన బిల్ల ఓం వయసు 21ఏళ్లు. ఇతడు బీబీఏ పూర్తి చేశాడు. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ వయసు 19 ఏళ్లే. ఇతడు కఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. వీరిద్దరూ ఒకే అమ్మాయి ప్రేమలో పడిపోయారు. ఆ యువతి ఎవరిని ప్రేమిస్తోందన్న విషయం తెలియరాలేదు. అయితే ఆ యువతితో ప్రమేయం లేకుండానే.. ఆ యువతిని దక్కించుకునేందుకు వీరిద్దరూ తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.
ఈ క్రమంలో వీరి ప్లాన్ లు వారిద్దరి మధ్య శత్రుత్వానికి కారణమైంది. తన మీద ఆ యువతికి లేనిపోని విషయాలు చెప్పి తనను ఆ యువతికి దూరం చేసేలా రోహిత్ యత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఓం ఆగ్రహానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని నేరుగా అతడితోనే తేల్చుకునేందుకు రోహిత్ కు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. అసలు నీవెక్కడున్నావని ఓం అడగగా… తాను టవర్ లేన్ లో ఉన్నానని రోహిత్ చెప్పాడు. దీంతో ఓం తన థార్ కారుతో అక్కడికి వచ్చి… రోహిత్ కూర్చున్న థార్ ను ఢీకొట్టాడు. రోహిత్ కూడా అదే పనిచేశాడు. ఇలా రెండు థార్ కార్లు పరస్పరం ధీకొంటున్న నేపథ్యంలో పెద్ద శబ్దాలు వెలువడ్డాయి.
ఈ గొడవను గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోగానే రోహిత్ అక్కడి నుంచి పరారు కాగా… ఓం మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. విచారణలో భాగంగా ఓం ఫ్యామిలీకి మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంతో బంధుత్వం ఉందట.
ఇక రోహిత్ తండ్రికి బెజవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఓ డీఎస్పీతో స్నేహం ఉందట. ఇద్దరూ తమ వెనుక ఉన్న ఈ రాజకీయ, పోలీసుల బలగంతోనే నడి రోడ్డు మధ్యలో ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే… ఈ ఇద్దరు స్నేహితుల మద్య ఘర్షణకు కారణమైన యువతి.. ఘర్షణ సమయంలో రెండు కార్లలోని ఓ కారులో అలా కూర్చుండి చోద్యం చూసినట్టుగా తెలుస్తోంది.
This post was last modified on May 22, 2026 12:46 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…