‘బీడీఎస్ఎం రోల్‌ప్లే ‘ పేరుతో ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. వాయవ్య బెంగళూరులో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ప్రేమ పేరుతో ప్రియుడిని నమ్మబలికి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితురాలు ప్రేమ, మృతుడు కిరణ్ ఇద్దరూ రాజాజీనగర్‌లోని మొబైల్ సర్వీస్ సంస్థలో కలిసి పనిచేస్తూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వివాహానికి కిరణ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అంజననగర్‌లోని తన ఇంటికి కిరణ్‌ను పిలిపించిన ప్రేమ, ‘సర్ప్రైజ్ ప్రపోజల్’ పేరుతో కుర్చీకి కట్టేసి, కళ్లకు గంత కట్టింది. అనంతరం ముందుగానే సిద్ధం చేసిన ఇంధనాన్ని పోసి నిప్పంటించి, ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రియుడి నిర్లక్ష్యం, పెళ్లికి అంగీకరించకపోవడంపై కలిగిన ఆవేదనతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, సంబంధాల పేరుతో జరుగుతున్న వికృత చర్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 22, 2026 4:18 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…