Trends

తెలంగాణాలో పెరిగిపోతున్న ‘స్ట్రెయిన్’ టెన్షన్

స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణా ప్రభుత్వాన్ని బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఎక్కడో బ్రిటన్ను రూపం మార్చుకున్న కరోనా వైరస్ వణికించేస్తోందంటే అర్ధముంది. మరి అదే వైరస్ తెలంగాణాను కూడా ఎందుకు వణికించేస్తున్నట్లు ? ఎందుకంటే బ్రిటన్ నుండి తెలంగాణాకు ఈనెలలో 3 వేలకు పైగా వచ్చారట. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు అంటే సుమారు 800 మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటి నుండి అందిన సమాచారం వల్ల బయటపడింది. అందుకనే ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతోంది.

డిసెంబర్ లో బ్రిటన్ నుండి తెలంగాణాకు వచ్చి సుమారు 3 వేలమందిని రెండు విధాలుగా వర్గీకరించారు ఉన్నతాధికారులు. మొదటి రెండు వారాల్లో వచ్చిన వారు కొందరు, చివర రెండువారాల్లో వచ్చిన వారు మరికొందరు. మొదటి రెండువారాల్లో వచ్చిన వారి సంఖ్య సుమారు 1800 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇలా వచ్చిన వారివల్ల పెద్దగ సమస్యలు లేవట.

అయితే చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మంది వల్లే సమస్య ఎక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆందోళనపడుతున్నారు. ఇంత ఆందోళన ఎందుకంటే కరోనా వైరస్ కన్నా రూపం మార్చుకున్న స్ట్రెయిన కరోనా 70 శాతం స్పీడుగా వ్యాపిస్తోందని శాస్త్రజ్ఞలు, వైద్య నిపుణులు చెప్పటమే. చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మందిలో 800 మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారట.

మొత్తం 3 వేలమంది ఆచూకీ కనుక్కునేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. కరీంనగర్లో 16 మంది, నిర్మల్ ముగ్గురు, వరంగల్, రంగారెడ్డిలో 270 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ కు ముగ్గురు చేరుకున్నట్లు గుర్తించారు. బ్రిటన్ నుండి వచ్చిన వారిని గుర్తించి శాంపిల్సు కలెక్ట్ చేయటం ఉన్నతాదికారులకు తలకుమించిన పనిగా మారిపోయింది. వీళ్ళ సంగతి ఇలాగుంటే ఒక్క హైదరాబాద్ లోనే 800 మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.

టికెట్ల ఆధారంగా వాళ్ళ అడ్రస్సులు పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి అధికారుల ప్రయత్నాలు ఎప్పటికి సానుకూలమవుతాయో ఈలోగా వాళ్ళు ఎక్కడి నుండి ఇంకెక్కడికి ప్రయాణం చేస్తారో ఎవరికీ తెలీకుండా ఉంది. వీళ్ళ వల్ల ఇంకెంతమందికి స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకుతుందో అన్న కారణంగానే ఉన్నతాధికారులు టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on December 24, 2020 11:42 am

Share

Recent Posts

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

13 minutes ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

3 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

6 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

6 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

8 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

10 hours ago