ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ మొదలైపోయింది. అన్ని చోట్లా ముందు కరోనాపై పోరులో కీలకంగా ఉన్న వైద్య, పారిశుద్ధ్య, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రఖ్యాత అమెరికన్ ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ పనితీరు చాలా బాగున్నట్లుగా అధ్యయనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
యుఎస్‌లో ఈ కంపెనీ వ్యాక్సిన్‌నే ఎక్కువమందికి ఇస్తున్నారు. ఐతే ఆ దేశంలోని టెన్నిస్సీలోని ఓ నర్సు ఫైజర్ టీకా తీసుకున్న వెంటనే కుప్పకూలడం ఆందోళనకు గురిచేసింది. సంబంధిత వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సదరు నర్సు వీడియో తీస్తుండగా వ్యాక్సిన్ వేసుకుంది. ఆ వీడియో లైవ్ కూడా అయింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆమె తన అనుభవాన్ని వివరించే ప్రయత్నం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పిన ఆమె.. కొన్ని క్షణాల తర్వాత ఒక్కసారిగా తలపట్టుకుని ‘‘క్షమించండి, అసౌకర్యంగా అనిపిస్తోంది’’ అని చెబుతూనే అలాగే కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
మీడియా సమావేశాన్ని కవర్ చేస్తున్న కెమెరాలు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో లక్షల మంది షేర్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్ ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐతే ఆ నర్సుకు ఏమీ కాలేదని.. ఆమెకు అలర్జిక్ రియాక్షన్ ఏమీ జరగలేదని.. ఎక్కువ ఎమోషన్‌కు, ఒత్తిడికి గురైనపుడు జరిగే వాసోవగల్ రియాక్షన్ కారణంగా ఆమె స్పృహ తప్పిందని.. ఆమెకు ఎలాంటి అపాయం లేదని.. తన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టత ఇచ్చారు. ఐతే నెటిజన్లు మాత్రం రకరకాల పుకార్లు జోడించి ఈ వీడియోను షేర్ చేసి వ్యాక్సినేషన్ మీద భయాలు పెంచేస్తున్నారు.
This post was last modified on December 20, 2020 4:58 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…