Trends

ఆ యాప్ వలలో పడ్డారా? ఇక అంతే సంగతులట

కాల్ మనీ.. మైక్రో ఫైనాన్స్.. మీటర్ వడ్డీ మీద ఇచ్చే రుణాలు.. ఇవన్నీ ఇప్పటి వరకు విన్నవే. మారిన కాలానికి తగ్గట్లే.. అప్పుల వలలో చిక్కుకునేలా చేసి.. ఆ తర్వాత చుక్కలు చూపించే సరికొత్త దారుణానికి పాల్పడిన ఉదంతం కొత్తగా తెర మీదకు వచ్చింది.

యాప్ ద్వారా రుణాల్ని అందించటం.. ముఖం ముఖం చూసుకోకుండానే.. మన దగ్గర వివరాలన్ని సేకరించి.. అడిగినంతనే అప్పు ఇచ్చేయటం.. దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు కానీ దాని అసలు రంగు బయటకు రావటమే కాదు.. ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చేందుకు కిందా మీదా పడే దుర్మార్గపు రుణ యాప్ ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీని బారిన పడి.. ఆస్తులు పోగొట్టుకోవటమే కాదు.. కొత్త అప్పుల చిక్కుల్లో చిక్కుకోవటం.. అన్నింటికి మించి పరువు పోయిందన్న వేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి ఉదంతాలు ఈ మధ్యన చూస్తున్నదే. తాజాగా ఒక వ్యక్తి ఇలాంటి 30 యాప్ ల దగ్గర అప్పు తీసుకొని.. దారుణ స్థితిలోకి చేరుకోవటమే కాదు.. వారి వేధింపుల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది.

ఈ అంశంపై అలెర్టు అయిన సైబరాబాద్ పోలీసులు.. ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున రుణ యాప్ లు ఉన్నట్లు గుర్తించటమే కాదు.. వీటిల్లో చాలావరకు అధికారిక అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. వీరి వేధింపుల గురించి వివరాలు సేకరిస్తున్నపోలీసులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. యాప్ పేరుతో సాగుతుున్న రుణ దందా ఇంత తీవ్రంగా ఉంటుందా? ఇంత దారుణమైన మానసిక హింసకు గురి చేస్తారా? అని అవాక్కు అవుతున్న దుస్థితి.

ఈ తరహా వైఖరిని ప్రదర్శించే కొన్ని యాప్ లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సేకరించిన కొన్ని యాప్ ల పేర్లు ఇలా ఉన్నాయి. ఇవే కాకుండా.. ఈ తరహా దారుణాలకు పాల్పడే యాప్ లు మరిన్ని ఉన్నట్లుగా చెబుతున్నారు. అప్పులు తీసుకొన్న బాధితులు దారుణ అనుభవాలు ఎదురైన యాప్ ల్లో కొన్నింటి జాబితాను సిద్ధం చేశారు.

అవేమంటే.. ‘‘ఇన్‌ క్యాష్‌, క్యాష్‌ ఎరా, క్యాష్‌ లయన్‌, మాస్టర్‌మెలన్‌, లక్కీ వాలెట్‌, కోకో క్యాష్‌, రుపీప్లస్‌, ఇండియన్‌ లోన్‌, క్రెడిట్‌ ఫించ్‌, ట్యాప్‌ క్రెడిట్‌, రాథన్‌ లోన్‌, క్యాష్‌ పోర్ట్‌, స్మైల్‌ లోన్‌, క్రెడిట్‌ డే, క్యాష్‌ టుడే, లక్కీ రూపీ, గో క్యాష్‌, స్నాప్ఇట్‌ లోన్‌, లోన్‌ జోన్‌, క్విక్‌ క్యాష్‌, పండారూపీస్‌, ప్లే క్యాష్‌, ధని, లేజీ పే, లోన్‌ ట్యాప్‌, ఐపీపీబీ మొబైల్‌, మైక్రెడిట్‌, క్విక్‌ క్రెడిట్‌, క్యాష్ఆన్‌, రూపీస్‌ ప్లస్‌, రూపీ నౌ, ఎలిఫెంట్‌ ఓలన్‌, ఆంట్‌ క్యాష్‌, క్విక్‌ మనీ, అల్ప్‌ క్యాష్‌’’. సో.. బీకేర్ ఫుల్.

This post was last modified on December 20, 2020 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

57 minutes ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

2 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

2 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

3 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago