Trends

ఇండో పాక్ మ్యాచ్.. మొదలవకముందే ఓ టెన్షన్

​క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పుడు వాతావరణం రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది. ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ పోరుపై వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం మొత్తం ప్రస్తుతం కవర్లతో కప్పి ఉంచడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

​శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఆదివారం సాయంత్రం కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం 70 శాతం వరకు ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మ్యాచ్ సమయంలో చినుకులు పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చే విషయం ఏంటంటే, ప్రేమదాస స్టేడియంలో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పే అద్భుతమైన సదుపాయం ఉంది. వర్షం తగ్గిన వెంటనే కేవలం 20 నిమిషాల్లోనే గ్రౌండ్‌ను సిద్ధం చేసి ఆటను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

​ఈ మ్యాచ్ నిర్వహణ వెనుక ఒక పెద్ద రాజకీయ డ్రామానే నడిచింది. మొదట భారత్ తో ఆడబోమని భీష్మించిన పాకిస్థాన్, ఐసీసీ, పొరుగు దేశాల ఒత్తిడితో చివరకు వెనక్కి తగ్గింది. కోట్లాది రూపాయల బిజినెస్, బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందాల కారణంగానే ఈ మ్యాచ్ కొలంబోలో ఖరారైంది. ఐపీఎల్ సమయంలో మొదలైన కొన్ని వివాదాలు సద్దుమణగడంతో, ఎట్టకేలకు దాయాదుల పోరుకు మార్గం సుగమమైంది.

​ప్రస్తుతం టీమిండియా అదిరిపోయే ఫామ్‌లో ఉంది. అమెరికా నమీబియాపై భారీ విజయాలు సాధించిన సూర్యకుమార్ సేన, ఇప్పుడు 4 పాయింట్లతో టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెట్ సాధించి జట్టులోకి రావడం భారత్ కు పెద్ద ప్లస్ పాయింట్. గత ఆసియా కప్ ఫైనల్ మాదిరిగానే ఈసారి కూడా పాక్‌ను చిత్తు చేయాలని టీమిండియా భావిస్తోంది.

​ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న భారత్ కు దీనివల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ, పాకిస్థాన్ కు మాత్రం ఒత్తిడి పెరుగుతుంది. ఏదేమైనా కనీసం ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ప్రకృతి సహకరించి ఈ మెగా ఫైట్ సజావుగా సాగాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. మరి కొలంబో ఆకాశంలో రేపు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

This post was last modified on February 14, 2026 3:48 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago