Trends

ముస్తఫిజుర్ ఎఫెక్ట్: ఐపీఎల్ ప్రసారాలు బంద్

ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే పెద్ద దుమారం రేగింది. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను తప్పించడం ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారింది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి నోటీసు వచ్చే వరకు టీవీల్లో గానీ, ఆన్ లైన్ లో గానీ ఐపీఎల్ చూడటం అక్కడ కుదరదు. భారత క్రికెట్ బోర్డు ఎలాంటి సరైన కారణం లేకుండా తమ స్టార్ ప్లేయర్ ను అవమానించిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేకేఆర్ తీసుకున్న నిర్ణయం తమ ప్రజలను బాధించిందని, ఆగ్రహం తెప్పించిందని పేర్కొంది. మార్చి 26 నుంచి మొదలవ్వాల్సిన ఈ టోర్నీని బహిష్కరిస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రసారాలను ఆపేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అసలు ఈ గొడవకు మూల కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే. ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో భారత్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రూ. 9.20 కోట్లు పెట్టి వేలంలో కొన్న ముస్తఫిజుర్ ను వదిలేయాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. బోర్డు ఆదేశాల మేరకే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది.

దీనిపై ముస్తఫిజుర్ స్పందిస్తూ, “వాళ్లు నన్ను వదిలేస్తే నేనేం చేయగలను” అని నిరాశ వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ వివాదం వరల్డ్ కప్ కు కూడా పాకింది. భద్రతా కారణాల రీత్యా రాబోయే టీ20 వరల్డ్ కప్ లో తమ గ్రూప్ మ్యాచ్ లను భారత్ (ముంబై, కోల్ కతా) నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది.

కేకేఆర్ నిర్ణయానికి కౌంటర్ గా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ ప్రసారాలనే బ్యాన్ చేయడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐసీసీ కూడా బంగ్లా మ్యాచ్ లను శ్రీలంకకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on January 5, 2026 4:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజధాని రైతులు కోరుకున్నట్టు వాస్తు ప్రకారమే..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు త‌న మ‌న‌సు చాటుకున్నారు. రైతుల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను…

2 minutes ago

బొమ్మా బొరుసా… కోర్టు చేతిలో జీవోల బంతి

ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…

14 minutes ago

క‌ష్టాల్లో కానిస్టేబుల్ త‌ల్లి… వెంటనే స్పందించిన లోకేష్‌!

ఏపీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి త‌న మ‌న‌సు చాటుకున్నారు. లోక‌ల్‌గానే కాదు... విదేశాల్లో కూడా ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నార‌ని…

1 hour ago

అమిత్ షాతో బాబు భేటీ, చాలా కీలకం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ ఏడాదిలో తొలిసారి బుధ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు వివ‌రించారు.…

2 hours ago

ఏపీలో కొత్తగా 11,753 ఉద్యోగ అవకాశాలు..

ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం…

2 hours ago

రాహుల్ గాంధీని ఉరి తియ్యాలంటున్న కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్…

3 hours ago