ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విషయంలో విశాఖ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు, వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోతే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఈ-చలాన్ జారీ చేస్తున్నారు. దీంతో వాహనదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత రెండు రోజుల్లో పిలియన్ రైడర్ హెల్మెట్ కారణంగా వేలాది ఈ-చలాన్‌లు జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు 31 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, జనవరి 1 నుంచి ఈ-చలాన్‌ల ప్రక్రియ ప్రారంభించినట్లు ఉన్నతాధికారులు వివరించారు.
ఇదిలా ఉండగా, నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్–నో ఫ్యూయల్’ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించినప్పుడే పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందిస్తామని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
This post was last modified on January 3, 2026 11:08 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…