అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా వీసా నిబంధనలు వాళ్లను అక్కడ ఉండనివ్వడం లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు. చదువుకున్నవాళ్లు వెళ్లిపోవడం దేశానికి అవమానం అని భావిస్తూ, వాళ్ళకోసం గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డ్ పొందాలంటే మాత్రం జేబులో గట్టిగా డబ్బు ఉండాల్సిందే. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ కార్డు కావాలనుకుంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు (1 మిలియన్ డాలర్లు) అమెరికా ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అదే కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగి కోసం అయితే రెట్టింపు మొత్తం చెల్లించాలి. ఇది సాధారణ గ్రీన్ కార్డ్ కంటే చాలా పవర్ ఫుల్ అని, దీని ద్వారా త్వరగా పౌరసత్వం వస్తుందని ట్రంప్ చెబుతున్నారు.
ఇప్పటివరకు టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఇది చెక్ పెడుతుందని భావిస్తున్నారు. యాపిల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల సీఈఓలు తమ దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగులను వీసా సమస్యల వల్ల కోల్పోతున్నామని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు తమకు నచ్చిన టాలెంటెడ్ వ్యక్తులను ఎలాంటి భయం లేకుండా ఉద్యోగంలో కొనసాగించే వెసులుబాటు లభిస్తుంది. కానీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మందికి ఈ ఆఫర్ దక్కే అవకాశం రావచ్చు.
ఇది కేవలం వలసదారుల కోసమే తెచ్చిన పథకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ కూడా ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారిని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని, అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే దేశంలోకి రానివ్వాలనేది ఈ గోల్డ్ కార్డ్ అసలు ఉద్దేశం.
ఐదేళ్లపాటు ఎలాంటి మచ్చ లేకుండా ఉంటే వీరికి సిటిజన్ షిప్ కూడా లభిస్తుంది. అయితే ఇది సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షే అయినా, సంపన్న వర్గాలకు మాత్రం ఒక వరం లాంటిది. అమెరికా కలలు కంటూ, వీసా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించే బదులు, డబ్బుతో దర్జాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
This post was last modified on December 11, 2025 1:28 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…